75
క్రీస్తుకు మంగళ స్తోత్రము
రా - మారువ, తా - అట
(చాయ : సందియము వీడవే)
మంగళంబని పాడరే - క్రీస్తుకు జయ - మంగళంబని పాడరే - యేసుకు జయ - మంగళంబని పాడరే = మంగళంబని పాడి ¹సజ్జ - నాంగ పూజితుఁడై ²కృపాత - రంగిలోక సమూహ పాపవి - ³భంగుడని యుప్పొంగి జయజయ || మంగళం||
1. ఘన యూద దేశంబులో - బెల్లె హే - మున యూదా గోత్రంబులో = వినుఁ డు యేసేపునకు సతియై - తనరుచుండెడి మరియ కడుపున - జననమై యీ మర్త్య వరులకు - సద్గతిని గల్గించు వానికి || మంగళ ||
2. సోదరాళి భంగిని - భక్తుల నెల్లం - జూచి ప్రోచెడు వానిని = యూద దేశపు వారలధిక - బాధఁ బెట్టుచు హింసఁజేసిన - సాదరంబున ⁴త్రిదినములకు ముదముతో గనుపడిన ప్రభునకు || మంగళ ||
3. ధరణి నొల్చెడి దాసజ - నములను బ్రోచు - దైవ తనయుఁడని నిజ = ⁵మరయ నిలను స్మరించువారికి - గురుతరంబగు ⁶కలుష జలనిధి - దరికి జేర్చు పరమ పదమే - ⁷యిరు వొనర్చెద ననిన ప్రభునకు || మంగళ ||
– పురుషోత్తము చౌదరి
___________________________________
¹సజ్జన సమూహముచేత పూజింపబడిన వాడై . ²అలలవంటి కృపగలవాడు. ³నాశనము చేయువాడు.⁴మూడు రోజులకు. ⁵విచారింపగా ⁶పాప సముద్రము ⁷నివాసము.
No comments:
Post a Comment