జాలిగా మనుజాళికై - కలువరిలోని ఆ యాగము
చాటెద ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగేవరకూ
||దేవా నీ సాక్షిగా||
1. నాలాంటి నరమాత్రుని చేరుట -
నీవంటి పరిశుద్ధునికేలనో (2)
ఏ మేధావికి విదితమే కాదిది -
కేవలం నీ కృపే దీనికాధారము
ఈ సంకల్పమే నా సౌభాగ్యమే,
నా బ్రతుకంతా కొనియాడుట
||దేవా నీ సాక్షిగా||
2. నా ఊహకందని మేలుతో -
నాా గుండె నిండింది ప్రేమతో (2)
నా కన్నీటిని మార్చి పన్నీరుగా
నాట్యము చేయు అనుభవమిచ్చావుగా
ఈ శుభవార్తను చాటు సందేశము -
నేను ఎలుగెత్తి ప్రకటించెద
||దేవా నీ సాక్షిగా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment