180
క్రీస్తు సిలువ బాధ
రా - గాంధారి, తా - ఏక
మనస యేసు మరణ బాధ - లెనసి పాడవే - తన - నెనరు జూడవే యా - ఘనుని గూడవే = నిను - మనుప వచ్చె ననుచు నమ్మి మదిని వేడవే ||మనస||
1.అచ్చి పాపములను బాప - వచ్చినాడట - వా - క్కిచ్చి తండ్రితో - నా - గెత్సెమందున = తా - జొచ్చి యెదను నొచ్చి బాధ - హెచ్చు గనెనట ||మనస||
2.ఆ నిశీధ రాత్రి వేళ - నార్భటించుచు - న - య్యో నరాంతకుల్ - చే బూని యీటెలన్ = ఒక - ఖూని వాని వలెను గట్టి - కొంచు బోయిరా ||మనస||
3.పట్టి దొంగవలెను గంత - గట్టి కన్నులన్ - మరి - గొట్టి చెంపలన్ వడి - దిట్టి నవ్వుచున్ = నిను - గొట్టి రెవ్వ రదియు మాకు జెప్పు - మనిరట ||మనస||
4.ముళ్లతోడ నొక కిరీట - మల్లి ప్రభు తలన్ - బెట్టి - రెల్లు కర్రతో నా - కల్ల జనములు = రా - జిల్లు మనుచు గొట్టి నవ్వి - గొల్లు బెట్టిరా ||మనస||
5.మొయ్యలేక సిల్వ భరము - మూర్ఛ బోయెనా - అయ్యయ్యో జొక్కెనా - యే - సయ్య తూలెనా = మా - యయ్య నిన్ దలంప గుండె - లదరి పోయెనా ||మనస||
6.కాలు సేతులన్ గుదించి - కల్వరి గిరిపై - నిన్ - గేలిజేయుచు - నీ - కాళ్ల మీదను = నినుప - చీలలతో గ్రుచ్చి నిన్ను - సిల్వం గొట్టిరా ||మనస||
7.దేవ సుతుడ వైతి వేని - తీవరంబుగా - దిగి - నీవు వేగమే - రమ్ము - గావు మనుచును = ఇట్లు - గావరించి పల్కు పగర - కరుణ జూపెనా ||మనస||
8.తన్ను జంపు శత్రువులకు - దయను జూపెనా తన - నెనరు జూపెనా - ప్రభు - కనికరించెనా = ఓ - జనక యీ జనుల క్షమించు - మనుచు వే డెనా ||మనస||
9.తాళలేని బాధ లెచ్చి - దాహ మాయెనా - న - న్నేలు వానికి - నా - పాలి స్వామికి = నే - నేల పాపములను జేసి - హింస పరచితి ||మనస||
10.గోడు బుచ్చి సిలువ పైన - నేడు మారులు - మా - ట్లాడి ప్రేమతో - నా నాడు శిరమును = వంచి - నేడు ముగిసే సర్వ మనుచు - వీడె బ్రాణము ||మనస||
11.మరణమైన ప్రభుని జూచి - ధరణి వణకె నా - బల్ - గిరులు బగిలెనా - గుడి - తెరయు - జీలెనా = దివా - కరుడు చీక టాయె మృతులు - తిరిగి లేచిరి ||మనస||
12.ఇంత జాలి యింత ప్రేమ - యింత శాంతమా - నీ - యంతః కరుణను - నే - జింత చేయగా = నీ - వింత లెల్ల నిత్య జీవ - విధము లాయెనా ||మనస||
- మిక్కిలి సమూయేలు
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment