మధురమైనది మార్పులేనిది
స్వచ్ఛమైనది - సృష్టిలో శ్రేష్ఠమైనది (2)
మరువలేనిదీ - శాశ్వతమైనదీ.....
తరతరాలలో తరగని క్రీస్తు తత్వమది
ప్రేమ తత్వమది - క్రీస్తు ప్రేమతత్వమదీ...
1.ప్రేమకు రూపమిచ్చి - భువిపై మనిషిగా పుట్టి
ప్రేమను మనిషికి పంచి - పాపులను క్షమించి (2)
నిందలను భరించి - హింసలను సహించి
మాదిరిని చూపించి - మార్గము తానై వేసి
నిలిచింది మహాత్ములకు ఆదర్శంగా -
గెలిచింది మనసులను విశ్వవ్యాప్తంగా (2)
మరువలేనిదీ - శాశ్వతమైనదీ..
తరతరాలలో తరగని క్రీస్తు తత్వమది
ప్రేమ తత్వమది - క్రీస్తు ప్రేమతత్వమదీ.. ||మదుర||
2.కరుణకు రూపమిచ్చి - కనికరమును ధరించి
దయాగుణం చూపించి - రోగులను స్వస్థపరచి (2)
బీదల ఆకలి తీర్చి - మనిషికి ప్రేమను నేర్పి
శత్రువును ప్రేమించి - దుష్టత్వమును సహించి నిలిచింది మనుష్యులకు మాదిరిగా నడచింది భూలోకంలో దైవముగా (2)
మరువలేనిదీ - శాశ్వతమైనదీ......
తరతరాలలో తరగని క్రీస్తు తత్వమది
ప్రేమ తత్వమది - క్రీస్తు ప్రేమతత్వమదీ..||మదుర||
No comments:
Post a Comment