అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2)
ప్రార్ధించుము అలయకనే -
కనిపెట్టుము విశ్వాసముతో (2)
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును ||అన్ని||
కుమిలిపోతూ నలిగిపోతూ - ఏమౌతుందో అర్ధం కాక (2)
వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)
ఒకసారి యోచించుమా - నీ మొఱ్ఱను వినువాడు యేసయ్యా (2) ||అన్ని||
ఎవరికీ చెప్పుకోలేక - అంతగా బాధ ఎందుకు (2)
మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2)
ఒకసారి యోచించుమా - నీ మొఱ్ఱను వినువాడు యేసయ్యా (2) ||అన్ని||
No comments:
Post a Comment