Yesu vachedi velaaye | యేసు వచ్చెడి వేళాయె

234
ఆయన వచ్చు వేళాయెను
రా - కళ్యాణి, తా - అట
(చాయ: సంతోషింపరె)

యేసు వచ్చెడి వేళాయె సోదరులారా - కాశ మేఘములతోను = భాసురమగు తన నివాసంబునకు మనల - దీసుకపోయి ప్రకాశితులను జేయ ||యేసు||
 
1.నిద్రమేల్కొను వేళాయె సమయము దెలిసి - ఓరిమితో నుండరే = భద్రముగా శత్రుయుపద్రవమును దాటి - సిద్ధపడుఁడి ప్రభునియొద్ద నివసించుటకు ||యేసు||
 
2.తనువును బలిపెట్టిన మన రక్షకుఁడు - ఘన మహిమలోకి వెళ్లి = తన యింట స్థలములు మనకు సిద్ధముఁజేసి - చనుదెంచు వేళాయె కనిపెట్టి యుందాము. ||యేసు||
 
3.చాలారాత్రి గతించెను సోదరులారా - వెలుగు సమీపించెను = వేల దూతలతోడ యేసయ్యవచ్చును - కాలగురుతులగని మేలుకొనరెవేగ ||యేసు||
 
4.శోధన కాలమీదే యీధరణిలో - బాధలురావచ్చును = నాధుఁడైన యేసుపాదముల కడనుండ - యేది కీడుచేయలేదు మనపై నెపుడు ||యేసు||
 
5.మనలను బ్రేమించుచూ మన పాపముల - దనరక్తమున గడుగుచు - ఘన దేవునికి నర్చకులనుజేసిన ప్రభుని - కొనియాడి బలమహిమలను జెల్లింతుము నిరత ||యేసు||
     - చదలవాడ తామస్

No comments: