Kopa dinamu vachunu | కోప దినము వచ్చును

232
పాపాత్ముల యొక్క శిక్ష 
రా - పంతువరాలి, తా - అట 
(ఛాయా: ఇడుగో గొఱ్ఱెల కాపరి)

కోప దినము వచ్చును - పాపుల గుండె - పగులు కాలము వచ్చును = శ్రీ పాల యేసుని - దాపునఁ జేరక - మాపు రేపులు మహ - పాపులకును గొప్ప ||కోప||
 
1.భువిలో రాల కర్రల - పూజలఁజేయు - చవి దేవుండ్లని చెప్పెడి = అవిగాక తమవంటి - నరులదేవుండ్లని - యవివేకముగ నమ్ము - నరులందరికి నెంతో ||కోప||
 
2.నరహంతకులు దొంగలు - వ్యభిచారులు - మరి యబద్ధికు లందఱు ఇరుగు పొరుగు వారి - నిఁక మోసములు చేయు - నరులందఱు చెడ్డ నరకములోఁ బడునట్టి ||కోప||
 
3.ఆట పాటలవల్లను - పాపము చాల - వేటాడుకొను వారలు = బూట కముల వారలు - భువిలో యక్షిణిగాండ్రు - మాటలాడక యగ్ని - మడుగులో బడి కాలే ||కోప||
 
4.కులభేదములు గల్పించి - కుటిలమందు - బలముగ బ్రతుకుచుండు = ఇల మాయవాదుల - కిఁక నేమి గతిలేక - పలుగొరుకులు నుండె - బాధల పాలయ్యెడు ||కోప||
 
5.మీఁది దేవునివలనను - యియ్యంబడెడు వేద మొక్కటి సత్యము = ఆధారమైయుండు నాత్మరక్షణ కది - సాధులైనమ్మని భేదకులకు నెంతో ||కోప||

No comments: