595
మట్టలాదివారము
మనోవిలసితంబౌ - దినంబు - మహిమాన్వితంబు - అనంత జగతీమనోహ రంబు - ఘనాదిప్రభుయశః ప్రకాశంబు ||మనో||
1.మందమారుతములందము నొసగగ - డెందములకు నానందము నిడగా = సుందర పక్షుల సుమధుర గానము సుఖావహంబై శోభించెనుగా ||మనో||
2.అరుణ భాస్కరుని కిరణాకరము - ధరదిక్తటముల దరి జేరెనుగా = ధరా వలయమాఖర భానునిచే ధగద్ధగీయంబై వెల్గెనుగా ||మనో||
3.పులుగిల కిలకిల కలరవములతో - పొందుగ గలసిన భూరి రవంబు = లలితమనోహరశ్రావ్యమ వినుమా - తలపన్ దానికి కారణమేమో ||మనో||
4.రయమున నొలీవ నగంబుగనుమా - రభస యుక్తమగు జనమును గనుమా = జయంజయంబను జయ ధ్యానంబులు - వియదంతము జనమ్రోగుట వినుమా ||మనో||
5.ప్రసన్నవదనుడు - భానుతేజుడు - అసంఖ్యజనగణ పరివృతబలుడు = ప్రసితరాసభాసీనుడు యేసుడు - అసమ శాంతితో నరుదెంచెనహో ||మనో||
6.జయములు బాడెడు బాల చయముతో - సాత్వికుడై రాసభంబు నెక్కి = జయోత్సవంబుతో సర్వేశ్వరుడు - చనిహృదయము సమర్పించె దము ||మనో||
– ఇ. జి. ఆనందము
No comments:
Post a Comment