Makutamu leni maharajuvai | మకుటము లేని మహరాజువై

మకుటము లేని - మహరాజువై నీవు 
మహోపకారములు - నాయెడల చేసితివి 
యేసయ్యా కృపవెంబడి కృపతో - నన్నావరించి
నూతన వత్సర దయాకిరీటం - ధరియింపజేసితివి ||మకుట॥ 

1. శోధనలే సుడిగుండాలై - ఉపద్రవమే ప్రవాహమై
వడివడిగా పొర్లుచు - నా యింటిపై విసరికొట్టగా
విశ్వసించువాడు - కలవరపడడని ప్రభువా అభయహస్తమిచ్చి 
నీ కృపాదుప్పటితో - పాయలుగా చీల్చినావు ॥ మకుట||

2.ముఖ్య సంతోషము కంటే - కుడిచేయి నేర్పు కంటే
నూతన యెరూషలేమును - ఎంతో హెచ్చుగా ఎంచుకొంటిని 
పాప నియమ పోరాటంలో నీరసిల్లగా దేవా - నా ప్రాణములో 
త్రాణ పుట్టించి - జయమును కలుగేసితివి ॥ మకుట||

3.గోపరస వాసన నిండిన - బంగారు బుట్టాపనితో
విచిత్ర పనిగల వస్త్రం - నాకు ధరియింపజేసితివి
లెక్కింపలేని ఆత్మలతో - రాజా ! నిను చేరునట్లు
నా దేశ సరిహద్దులు - విశాలపరతునంటివి ॥ మకుట||

No comments: