కోరుకున్న వారలకు - ఉచితంగా ఇస్తాడయ్యా
నాశనమవుతున్న మానవాళికి - మహారక్షణ తెచ్చాడయ్యా
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త - బలవంతుడైన దేవుడాయనే అందుకే ఆడెదం పాడెదం
సంబరాలు చేసేదం యేసయ్య జననవార్త లోకానికి చాటెదం
ఓహో ఆడెదం పాడెదం సంబరాలు చేసేదం యేసయ్య జనన వార్త లోకానికి చాటెదం
యేసయ్య అందరికి చెందిన దేవుడు
విమోచకుడు సర్వశక్తిమంతుడు
నిత్యుడగు తండ్రి సమాధానకర్త శాంతిప్రధాత మన యేసుడే ||అందుకే||
యేసయ్య పుట్టాడు బెత్లహేములో నీలో జన్మించాలి నిజదేవుడు
బ్రతుకుమారుస్తాడు బహుగా దీవిస్తాడు నూతనసృష్టిగా నిన్ను మార్చేస్తాడు ||అందుకే||
No comments:
Post a Comment