Na pranama neeke vandanam | నా ప్రాణమా నీకే వందనం

నా ప్రాణమా యేసయ్యా… నా ధ్యానమా యేసయ్యా

నా ప్రాణమా నీకే వందనం - నా స్నేహమా నీకే స్తోత్రము (2)
నిను నే కీర్తింతును - మనసారా ధ్యానింతును (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ - 
హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా (2) ||నా ప్రాణమా||

నిను విడచి ఉండలేనయ్యా - నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా (2)

సర్వ భూమికి మహారాజ.. నీవే పూజ్యుడవు - 
నన్ను పాలించే పాలకుడా.. నీవే పరిశుద్ధ్దుడా (2)
సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా (2)
మోకరించి ప్రణుతింతును (2) ||హల్లెలూయ||

మహిమ కలిగిన లోకములో.. నీవే రారాజువూ -
నీ మహిమతో నను నింపిన... సర్వశక్తుడవు (2)
వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా (2)
మోకరించి ప్రణుతింతును(2) ||హల్లెలూయ||

No comments: