Mamun srujinchina devundu | మమున్ సృజించిన దేవుండు

102     Rejoice, the Lord is King

1. మమున్ సృజించిన - దేవుండు ప్రాణము 
నొసంగి యెప్పుడు - కాపాడు మమ్మును 
సంతోష స్వర మెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్.

2. పలువిధాలుగ - బాధించు రోగముల్ 
పోఁగొట్టి మీఁదకు - రాకుండఁ జేసెను 
సంతోష స్వర మెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్.

3. దేవుండు మాత్రమే - రక్షణ మార్గము 
ఆయత్తపఱచి - చూపించె మాకును 
సంతోష స్వర మెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్.

4. మా నిత్యబాధలు - వారించుకొరకుఁ 
దా సొంత పుత్రుని - పంపెన్ సుప్రేమతో 
సంతోష స్వర మెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్.

5. ఆనంద మొందుఁడి - శ్రీ యేసు మోక్షము 
స్వసేవకాళికి - అనుగ్రహించును 
సంతోష స్వర మెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్.
                                 - చార్లెస్ వెస్లీ

No comments: