130
Christians awake, salute the happy morn
ప్రసన్నుఁడైన తండ్రి ప్రేమను - ఆసక్తిపరులై కీర్తించుఁడి
క్రీస్తేను మానవాళితోడను - నశింపవచ్చెనంచు పాడుఁడి.
2. దేవుని దూత గొల్లవారికి - ఈ రీతిగాను ప్రకతించెనుః
‘ఈ వేళ మహా సంతోషంబగు - సువార్త నేను ఎరిగింతును.
దావీదు పట్నమం దీదినము - దైవరక్షకుఁడు జన్మించెను.’
3. త్వరగానే ఆకాశ సైన్యము - హర్షించుచు నీలాగు పాడెను
‘సర్వోన్న తాకాశంబునందుండు - సర్వేశ్వరునికి ప్రభావము
నరులయందు సమాధానము - ధరణిలో వ్యాపింపనియ్యుఁడు’
4. పరమతండ్రి దయారసము - నరులకెంతో నాశ్చర్యము
నరావతారుఁడగు దేవుఁడు - నిరపరాధిగాను జీవించి
నిర్దోషమైన త్రోవ చూపించి - విరోధులన్ ప్రేమించుచుండెను.
5. శ్రీ మాత సైన్యముతో మేమును - వాద్యములు వాయించుచుందుము;
ఈ దినమందు నుద్భవించిన - యా దివ్యకర్తను వీక్షింతుము;
సదయుఁడైన యేసు ప్రేమను - సదా స్తుతించి పాడుచుందుము.
- జాన్ భైరొం
అను: బర్నర్డ్ లూకాస్
No comments:
Post a Comment