ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. – ప్రసంగి: 3 : 1.

నేటి దిన ధ్యానము ⛪
🙏 ప్రభువు నామములో అందరికి శుభోదయం 🙏

✝️ *దాని సమయం దానికి ఇవ్వుము* ✝️

ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. 
– ప్రసంగి: 3 : 1.

మనందరికీ ఒక గొంగళి పురుగును దాని గుళ్లలోనుండి వెలికి తీయడానికి సహాయము చేసిన చిన్న బాలుడి కథ తెలుసు. ఆ బాలుడు దానికి సహాయం చేయాలనుకున్నాడు. అతడు చిన్నగా దానిని పగలగొట్టి బయటకు తేవాలనుకున్నాడు. పగలగొట్టిన తర్వాత దాని నుండి గొంగళి బయటకు వచ్చి నేలపై పడి మరణించింది. కానీ అటు తరువాత మరి ఒక గొంగళిని దాని గూటిలో చూసిన ఆ బాలుడు దానిని ముట్టుకోలేదు. అతడు దానిని రోజూ ఊరకనే గమనించేవాడు. దాని సమయం వచ్చినప్పుడు దానంతట అదే సుందరమైన సీతాకోకచిలుక లాగా మారి బయటకు వచ్చి ఎగిరిపోయింది.

అవును ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించారు. మనం కూడా ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనమనుకున్నది, మనకిష్టమైన సమయంలో జరగడంలేదని నిష్టూరపడుతుంటాము. కానీ అన్నింటికంటే ఉత్తమమైన సమయం ఏమిటో దేవుడికి తెలుసు. ప్రసంగి రాసిన గ్రంథకర్త ఈ మూడవ అధ్యాయంలో సమయం గురించి అనేకసార్లు రాశారు. ఈ విధంగా ఉంటుంది “పుట్టుటకు సమయం కలదు, మరణించుటకు సమయం కలదు, నాటుటకు సమయం కలదు, నాటిన దానిని పెరికి వేయుటకు సమయం కలదు, చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు; ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు; వెదకుటకు పోగొట్టుకొనుటకు , దాచుకొనుటకు పారవేయుటకు … ప్రేమించుటకు ద్వేషించుటకు;..” ఆ విధంగా సాగి పోతుంది. కనుక ఖచ్చితమైన సమయం కొరకు దేవుని మీదనే ఆధారము చేసికొని ఓపికగా వేచి చూద్దాం.

🛐ప్రార్థన:🛐
ప్రభువా, మా కార్యములను జరిగించుకోవడానికి, సంపూర్ణంగా మీ ద్వారానే జరిగించు కోవడానికి, మాకు కావలసిన ఓర్పునివ్వండి. అలసిపోకుండా విసుగు చెందకుండా దాని సమయం వచ్చే వరకు, ఓపికతో వేచి ఉండడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

ప్రతి దానికి సరైన సమయం కలదు, ఒక్కొక్కసారి నీవే దానిని జరిగించాలి, ఒక్కొక్కసారి నీవు దాని కొరకు వేచి ఉండాలి. – విల్సన్ కెనడి.

No comments: