అర్ధము చేసుకొనుడి


🙏ప్రభువు నామములో శుభోదయం🙏...
నేటి దిన ధ్యానము

✝️అర్ధము చేసుకొనుడి✝️

వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనియెహోవా ఆకాశమునుండి చూచి 
నరులను పరి శీలించెను 
కీర్తనలు 14 : 2

అర్థం చేసుకోవడం అనేది భార్యాభర్తల మధ్య, మిత్రుల మధ్య, బంధువుల మధ్య, కుటుంబంలో, స్నేహితుల మధ్య ఒక పెద్ద సంగతి అయింది, ప్రతి ఒక్కరూ వారిని వేరే వాళ్లు అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. సర్వ సాధారణంగా వినిపించే మాట ఏమిటంటే. “నన్ను ఎందుకు అర్థం చేసుకోరు?” . మనలో చాలా మంది మన సంభాషణలో ఈ మాట వాడుతూ ఉంటాము. మన దేవుడు ఆకాశము నుండి క్రిందకు చూస్తూ తనను అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉన్నారా? అనుకుంటున్నారు. కీర్తనకారుడు కీర్తన 14 లో "తనను ఎవరైనా అర్థంచేసుకుంటున్నారా అని తెలుసుకోవాలనుకుంటున్నారు” అని రాస్తున్నాడు. ఎవరైనా మంచి చేసే వాళ్ళు ఉన్నారా? అని చూస్తున్నారు. కానీ ఆయనకు ఎవరూ దొరకలేదు. కీర్తనకారుడు మంచి చేసే వాళ్ళు ఎవరు లేరు ఒక్కరు కూడా లేరు అని రాస్తున్నాడు. ఆ సమయంలో అందరూ దుష్ట క్రియలు చేస్తూ, పేదవాళ్లను నిర్లక్ష్యం చేస్తూ, దేవుని దృష్టికి దుష్టులై వున్నారు.

చివరగా ఏడవ వచనంలో “సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును” అని రాశారు. ఆమెన్!

ఈ రోజుల్లో కూడా మంచి వారి కోసం, తనను అర్థం చేసుకునే వారి కోసం, దేవుడు పై నుండి చూస్తున్నారు. కనుక మంచి పనులు చేసి, ఆయనను అర్థం చేసుకుని, ఆయనను సంతోషపరచెదము. ఆయన నీతిమంతులను కనుగొనినప్పుడు మనము ఉల్లసించి, సంతోషించిదము.

🙏ప్రార్ధన:🙏

ప్రభువా మిమ్మును అర్థం చేసుకొనే మంచి హృదయం మాకు ఇవ్వండి, అప్పుడు మీరు పైనుండి చూసినప్పుడు మేము మీ దృష్టికి నిందారహితులిగా కనబడునట్లు గా చేయుమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి! ఆమెన్.

👉శాంతి అనేది బలవంతం మీద రాదు, అది అర్థం చేసుకోవడం వల్లనే సాధ్యపడుతుంది. - ఆల్బర్ట్ ఐన్స్టీన్

No comments: