వినబడిన ప్రార్థన


🙏ప్రభువు నామములో శుభోదయం🙏...
⛪ నేటి దిన ధ్యానము:- ⛪

 ✝️*వినబడిన ప్రార్థన* ✝️

ఈ భాగం హేరోదు రాజు కాలంలో జెకర్యా యూద యాజకుడు అబియా తరగతికి చెందిన యాజకుడు. యూద యాజకులు 24 తరగతులుగా విభజింపబడ్డారు. వాటిలో అబియా ఒకటి. జెకార్య భార్య ఎలిజబెతు కూడా ఒక యాజకుని కుమార్తె. అతడు అహరోను సంతతి వాడు.ఎలిజబెతు గొడ్రాలు కాబట్టి ఆమె సంతానము లేకున్నది.ఒక స్త్రీ కి సంతానము లేకపోతే దానికి ఆమె పాపమే కారణమని యూదులు తలంచే వారు; అయితే లూకా "వారు దేవుని దృష్టికి నీతిమంతులై యున్నార"ని చెబుతున్నాడు. వారు బిడ్డల కొరకు దేవుని ప్రార్థించారు. కాని దేవుడు వారి విన్నపాన్ని దయ చేయలేదు. ఈ 24 యాజక భాగాలకు చెందిన యాజకులు ప్రతి సంవత్సరము రెండు వారాల పాటు యెరుషలేములోని యూదుల దేవాలయములో సేవా విధిని నిర్వహించాలి. ఆలయములోని పరిశుద్ధ స్థలములో దినానికి రెండు సార్లు ధూపము వేయాలి. ప్రతి తరగతిలో అనేకమంది యాజకులు ఉండటం వలన ప్రతి దినము ఎవరు ధూపము వేయాలో చీట్లు వేసి నిర్ణయించేవారు. యాజకుడు పరిశుద్ధ స్థలంలో ధుపము వేస్తుండగా ఆరాధించడానికి వచ్చిన వారు వెలుపల కనిపెట్టే వారు. తన పని ముగించుకుని తర్వాత అతడు బయటకు వచ్చి ప్రజలను దీవించే వాడు. అతడు పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు ఒక దూత ప్రత్యక్షమై భయపడవద్దు! నీ ప్రార్థన నాకు వినబడింది. నీకు నీ భార్య ఎలిజబెతుకు కుమారుడు కలుగుతాడని చెప్పాడు. ఆ బాలునికి వారు "యోహాను" అను పేరు పెట్టాలని చెప్పెను అ పేరు కు అర్ధము "దేవుడు దయగలవాడు" అని అర్థము. దేవుడు జెకర్యా ఎలిజబెతుల ప్రార్ధన విన్న దేవుడుగా, ఆశీర్వదించిన దేవుడుగా మనం చూస్తూ ఉన్నాము మన జీవితాల్లో కూడా అలాంటి ప్రార్థన చేద్దాం దేవుడు మన ప్రార్ధన ఆలకించే దేవుడుగా మనల్ని నడిపించి అభివృద్ధి పరచును గాక ఆమెన్!

 🛐*ప్రార్థన:-* 🛐
ప్రియ ప్రభువా! మా ప్రార్థనలను వినే దేవుడుగా, జవాబు ఇచ్చే దేవుడుగా, దేవా నా ప్రార్థనలన్నియు ఆలకించిమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.ఆమెన్!

No comments: