గోడల పై అజ్ఞలు

🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪

 ✝️*గోడల పై అజ్ఞలు* ✝️

సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. ద్వితీ 6: 7,8,9.

చాలా మంది క్రైస్తవులు, విశ్వాసులు, వాళ్ళ వాళ్ళ గోడల పైన ఆశీర్వాదాలు, ఇంకా దేవుని వాగ్దానాలు వ్రాసి పెట్టుకుంటారు. ఆ విధంగా చేయడం నిజంగా చాలా మంచిది. ఎందుకంటే, అవి మన కళ్ల ఎదుట ఉన్నప్పుడు, మన విశ్వాసము అధికమై మనము కృంగుదలకు లోను కాకుండా ఉంటాము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో, దేవుడు తన ప్రజలకు ఆయన ఆజ్ఞలను తమ పిల్లలకు నేర్పించాలని చెప్పారు. అంతే కాదు, వాటి గురించి నిత్యమూ మనము, మన పిల్లలతో మాట్లాడాలి. మనము కూర్చున్నపుడు, నడచునప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, ఆయన ఆజ్ఞలను, విధులను గూర్చి మన పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. మనమీవిధంగా చేసినప్పుడు, మన పిల్లలు దేవునిలో భయభక్తులతో పెరిగి, ఆశీర్వదించబడతారు.అంతే కాదు, వాటిని మన చేతులకు కట్టుకోవాలని, ఇంకా, కన్నుల మధ్య బాసికము లాగా ఉండాలని దేవుడంటున్నారు. కానీ పచ్చ బొట్టులు వేసుకోరాదు. ఈ రోజులలో శరీరమంతా పచ్చ బొట్లు పొడిపించుకుంటున్నారు. అది ఏ మాత్రము మంచిది కాదు. కానీ, ఆయన ఆజ్ఞలను, విధులను మన ఇంటి గోడల పైన, ద్వారబంధాల పైన, గవునుల పైన వ్రాసిపెట్టుకుంటే, వాటిని మనము మరచిపోము. అవి మన కన్నుల ఎదుటే ఎల్లప్పుడూ ఉంటే మనమిక పాపము చేయము.

🛐ప్రార్థన:🛐

పరలోకపు తండ్రీ, మీ ఆజ్ఞలను మేమెల్లప్పుడూ మా హృదయములలోనూ, ఇళ్లలోనూ ఉంచుకొననివ్వండి. మీకు విరోధముగా పాపము చేయనీయకండి. మీ మాటలకు లోబడుటకు మాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

👉ఆశీర్వాద పుస్తకము ఎంతటి ఆశీర్వాదాన్ని, జీవాన్ని, ఆరోగ్యాన్ని, సమృద్ధిని, శాంతిని తెస్తుందంటే, ఇంక మరెన్నడూ మనము పేదవాళ్ళము కాము. – స్మిత్ విగల్స్ వర్థ్.

No comments: