తేజోమయమైన స్థితి


🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము:-⛪

✝️ *తేజోమయమైన స్థితి* ✝️
అయితే నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; 
అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును.
మలాకీ 4:2

దేవునియందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుడు మనకి ఏమై ఉన్నారనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. ఇక్కడ నీతి సూర్యుడు ఉదయించెను అనే మాట కనిపిస్తోంది. ఆయన రాకతో అంధకారమును తొలగించి అన్న భావన ఇక్కడ కనిపిస్తుంది. యూదులలో దేవుడు సూర్యుడు అనే వాడుక ఉంది. కీర్తన 84:11,యెష 60:19,1 యోహా 2:1,2

సూర్యుని యొక్క కిరణాలు ఆయన రెక్కలుగాను రెక్కలను కప్పుట ఆయన కాపుదలను సూచించును అని మనం గమనించాలి. "క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు" ఇది పూర్ణ శక్తిని సూచించును. యోసేపు బానిసగా కొనిపోబడినా. దేవుని యందలి భయభక్తులు విడవలేదు దేవుని వాత్సల్యత అతని యెడల నూతనముగా పుట్టిచూ, విదేశంలో అతనిని గొప్ప అధికారిగా నిలువబెట్టింది. అలాగే ఆయన నామంలో భయ భక్తులు కలిగి నీవు జీవించిన్నట్లయితే సూర్యుడు ఉదయించినప్పుడు ఎంత తేజోమయంగా ఉంటాడో, అంతే తేజోతత్వంలో నీవు కూడా వికసిస్తావు అని దేవుని వాక్కు నీకు తెలియజేస్తుంది.

🛐ప్రార్ధన:-🛐
ప్రియ ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి జీవించటానికి నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి!ఆమెన్.

No comments: