తగ్గించుకొనువాడు హెచ్చించబడును

🙏ప్రభువు నామమున శుభోదయం.🙏..
⛪నేడు దిన ధ్యానము:⛪
 ✝️*తగ్గించుకొనువాడు హెచ్చించబడును*✝️

"ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును." 
యాకోబు 4:10

తగ్గింపు గుణం క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంతో కీలకమైనది అపో" పౌలు యేసయ్య విధేయతను, తగ్గింపును చాలా స్పష్టంగా ఫిలిప్ఫి 2:6-11 లో వివరిస్తున్నారు చాలామంది క్రైస్తవులు వారు పొందుకున్న స్థితిగతులను బట్టి దేవుని ఉచిత కృపను బట్టి మనలను హెచ్చయిoచిన విధానమును చూసుకొని అతిశయిస్తాము. కానీ ఈ స్థితి, ఈ హోదా అంతా దేవుడిచ్చినదే అని తెలుసుకోవాలి.మనలను మనం తగ్గించుకోవాలి. యేసయ్య తననుతాను తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగినారు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు.నీవు కూడా తగ్గించుకుని జీవించుట వలన తక్కువవారుమై నట్టు కాదు గాని గొప్ప ఆధిక్యత పొంది హెచ్చరింపబడతాము. నీ స్థితిని బట్టి ఏ రీతిగాను, ఎన్నడూ హెచ్చించుకొనకూడదు. యేసయ్య తగ్గింపు, విధేయత ద్వారా సర్వాధికారము పొందకోగలిగారు. నీవు కూడా ఈ వాఖ్యం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నావు. నేను ఉన్న స్థితి కేవలం నా యెడల దేవుని దయ సంకల్పం అని గుర్తించి తగ్గింపు జీవితం కలిగి జీవించి దైవ దీవెనలు పొందుకోవడానికి దేవుని సహాయము కలుగును గాక!

🛐 *ప్రార్ధన*🛐

నా ప్రియ ప్రభువా! నా ఈ అనుదిన జీవిత యాత్రలో నిత్యము నన్ను నేను తగ్గించుకొనుచూ హెచ్చింపబడునట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

👉మీరు నా వినయ శక్తులను మించిన దానిని కోరుకుంటారు, కానీ నేను సర్వశక్తిమంతుడైన దేవుని కరుణ మరియు దయపై విశ్వసిస్తున్నాను.  - సెయింట్ స్టీఫెన్*

No comments: