యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. – లుకా 8:50


✝️నేటి దిన ధ్యానము✝️
🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
⛪*ఊరకనే నమ్ము*⛪

యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. 
– లుకా 8:50

12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ తనకు ఉన్న డబ్బంతా వైద్యుల మీద ఖర్చు పెట్టి చివరకు స్వస్థపరచబడలేక పోయింది. అప్పుడామె యేసు ప్రభువు వస్త్రాన్ని ముట్టి స్వస్థపరచ బడింది. ఆయన వస్త్రాన్ని ముట్టిన వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. ఆయన సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్ళవలసి ఉంది. ఇంకనూ ఆ స్త్రీ తో మాట్లాడుతూ ఉన్నారు, అప్పుడు అధికారి ఇంటి నుంచి ఒకరు వచ్చి అతనితో “నీ కుమార్తె చనిపోయింది బోధకుడి ని శ్రమ పెట్టవద్దని చెప్పాడు. వచ 49.

అప్పుడు యేసయ్య పైన రాసిన మాటలు చెప్పారు. మొదటిగా ఆయన “భయపడవద్దు” అన్నారు ఎందుకంటే భయం అనేది అద్భుతాలు అన్నిటినీ ఆపివేసే మొట్టమొదటి కారణం. రెండవదిగా ఆయన “నమ్మికమాత్రంఉంచు” అన్నారు. అవును మనం నమ్మినప్పుడు అసాధ్యమైన ప్రతి సంగతి సాధ్యమవుతుంది. మూడవదిగా ఆయన “ఆమె స్వస్థపరచబడును” అన్నారు.

ఆమె చనిపోయిందన్న వార్త విన్నప్పటికీ , యేసయ్య ఆమె బాగు పడుతుంది అంటున్నారు. ఈ మాటలను ఆయన పలికారు. చివరిగా ఆయన అమ్మాయిని మృత్యువు నుండి లేపి ఆమె తల్లిదండ్రులకు ఆమెను అప్పగించారు.

నీ జీవితములో కఠినమైన సమయం ద్వారా వెళ్తున్నావా? విశ్వాసాన్ని కోల్పోయావ? అంతా అయిపోయిందని నీవు అనుకుంటున్నావా? ఇప్పుడిక ఏమీ చేయలేను అనుకుంటున్నావా? సమస్తము నిరాశగా అనిపిస్తుందా? భయపడవద్దు చింతించవద్దు నీవు తిరిగి బాగుపడుదువు. ఆమెన్.

🛐ప్రార్థన:
ప్రభువ మీ అందు విశ్వాసం ఉంచడానికి మాకు సహాయం చేయండి, మీ యందు నమ్మిక ముంచి మీ ద్వారా అద్భుతాలు పొందుకొగలుగడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్

ప్రతి ఒక్కటి ఒక కారణం కొరకు జరుగుతుంది, దేవుని కొరకు వేచి ఉండి ఆయనని నమ్మ . మనకు కావలసిన శ్రేష్టమైనది ఇవ్వాలనీ ఆయనకిష్టం. ఆయన మనలను మహిమ నుండి అధిక మహిమకు జయం నుండి అత్యధిక జయముకు తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నారు. – జెర్మనీ కెంట్

No comments: