ఆయన నీ త్రోవలు సరాళము చేయును

🙏ప్రభువు నామములో శుభోదయం.🙏
నేటి దిన ధ్యానము

(ఆయన నీ త్రోవలు సరాళము చేయును)

నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును”.
సామెతలు 3:6

మనము దేవుని అనుసరించి నడుచుకోవాలని ననిర్ణయించుకున్నప్పుడు మనమెంతో పరివర్తన చెందవలసియున్నది మారుమనస్సు పొందవలసియుంది. దేవుని ఆధిక్యత మనలను సరైన విధంగా మారుస్తుంది స్వేచ్ఛతో కూడిన జీవితాన్ని ఆయన మనకు ఇవ్వదలచుచున్నాడు కానీ బంధించాలని కాదు.

మనము అనుభవించే శ్రమలు మనలను ఎంతో ధృడంగా మారుస్తాయి. అవి మన వ్యక్తిత్వాన్ని మన ఆత్మీయజీవితాన్ని బలపరచడానికి ఉద్దేశించబడినవి. మరియు మనము ప్రార్ధించగా, పరిశుద్ధాత్ముడు అనుదినం ఉండే చింతలను, అసహనాన్ని ఎలా ఎదురించాలో మనకు నేర్పి మనలను బలముగా, నిజాయితీగా తీర్చిదిద్దుతాడు.

ప్రార్థనా:
పరలోకమందున్న తండ్రి, నన్ను బలపరచి నా జీవితాన్ని ఫలింపజేసినందుకు నీకు వందనములు. నీ నిజమైన స్వేచ్ఛలో నడవడానికి సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్...

No comments: