నా కొండ నాకోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. – కీర్తనలు: 31: 3

నేటి దిన ధ్యానము:-
🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
 ✝️*జీవమార్గములో మమ్మును నడిపించుము* ✝️

నా కొండ నాకోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. 
– కీర్తనలు: 31: 3

మనము గొర్రెలను, గొర్రెల కాపరిని గమనించినట్లయితే, కాపరి ఎల్లప్పుడు గొర్రెలను సరియైన మార్గములో నడిపిస్తాడు. చాలాసార్లు గొర్రె తనకు ఎలా ఇష్టమైతే అలాగే వెళ్లాలని అనుకుంటుంది. ఒక్కొక్కసారి దేశ రాజ బాటలో అంటే రహదారిలో కూడా వచ్చి, అవి ఏం చేస్తున్నావే వాటికే తెలియకుండా ఉంటాయి. కానీ మంచి కాపరి వాటిని ఆపదలో పడనీయడు. తన చేతిలో ఎల్లప్పుడూ దుడ్డుకర్రను పెట్టుకొని వాటిని సరియైన మార్గంలో వెళ్ళేటట్లు నియంత్రిస్తూ ఉంటాడు.

మన మంచి కాపరి అయిన యేసయ్య కూడా అలాగే చేస్తారు. ఈ లోక కాపరుల కంటే కూడా మరీ ఎక్కువగా ఆయన బాధ్యత కలిగి ఉంటారు. ఒక్కొక్కప్పుడు మనం తప్పుడు నిర్ణయం తీసుకుంటుంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలను నివారించి, మనం అభివృద్ధి చెందే సరియైన మార్గంలో వెళ్ళేటట్లు చేస్తారు. మన మంచి కాపరి అయిన యేసయ్య మార్గదర్శకత్వం కోరి ఆయన మార్గంలో నడుద్దాం.

🛐ప్రార్థన:
ప్రభువా, మాకు మీ మార్గాలు చూపించి, సరియైన మార్గంలో మమ్మల్ని నడిపించండి. అక్కడే మేము అభివృద్ధి చెందుతాము. మేము మంచి ఆరోగ్యంతో, శాంతితో, సంతోషంతో, ఆనందముతో ఉండే మంచి మార్గంలోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్.

దేవుడు మీ భాగస్వామి అయితే నీ ప్రణాళికలు పెద్దవిగా చేసుకో – డి .యల్ . మూడి .

No comments: