దేవుని వైపు తిరిగి నడుచుకో


🙏ప్రభువు నామములో శుభోదయం🙏

నేటి దిన ధ్యానము

(దేవుని వైపు తిరిగి నడుచుకో)

“సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు”.
యిర్మీయా 29:11

సమాజము, సామాజిక మాధ్యమాలు మనమిలానే ఉండాలి, ఇలానే ఆలోచించాలి, ఇలానే కనపడాలని ఒక చట్రంలోకి నెట్టేసాయి. ఇందువలన మనము మనం బాగానే ఉన్నా ఇతరులతో పోల్చుకుని మనము సరిగా లేమేమోనని అసంతృప్తితో జీవిస్తూ ఉంటాము.

ఇలాంటి అపవాది యత్నాలను నీవు చేధించి నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అపవాది ఎప్పుడూ నిన్ను గర్వముతో, ఆత్మన్యూనతా భావంతో లేదా అభద్రతా భావంతో పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. నీవు ఆ వ్యూహాలన్నింటిని చెదరగొట్టాలి. అప్పుడే నువ్వు శాంతముగా ఉండగలవు.

నీవు దేవుని వైపు తిరిగి నడుచుకోనంతవరకు నీ జీవితం అంతా చిక్కులమయంగానే ఉంటుంది. ఆయన ఆలోచనలు మనకు మేలుచేసేవే నీ గానీ ఆ కీడు చేసేవి కావు. గనుక నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుము.

🛐ప్రార్థనా:🛐
ప్రియమైన తండ్రి, అపవాది యత్నాలను జయించుటకు మాకు సహాయము చేయుము. లోకమువైపు మరలిపోకుండా నీ వైపే దృష్టి నిలుపుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము, ఆమేన్.

👉 నేను నెమ్మదిగా నడిచేవాడిని, కానీ నేను తిరిగి నడవలేదు. 
- అబ్రహం లింకన్

No comments: