దేవుడి వాక్యమే మన ఆయుధం


🙏ప్రభువు నామములో శుభోదయం🙏

నేడు దిన ధ్యానము
 *(దేవుడి వాక్యమే మన ఆయుధం)* 

దేవుని వాక్యం మనకు ఇచ్చిన దేవుని ఆయుధం కాబట్టి మనము దానిని మన జీవితాలలో ఉపయోగించవచ్చు. విచారకరమైన వార్త ఏమిటంటే, మన కష్ట పరిస్థితులలో మనలో చాలా మందికి శక్తిహీనంగా అనిపిస్తుంది ఎందుకంటే కష్టాల్లో దేవుని వాక్యాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు.

మన కష్టాల గురించి చేప్పుకుంటూ పొతే పని జరగదు. అసలు మనం సమస్యల గురించి మాటలాడడం వెర్థం, మనం ఎదుర్కొంటున్న సమస్యతో పోరాడటానికి మనకు తెలిసిన దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి. ఇలా దేవుని ఆయుధాన్ని ఉపయోగించడం ద్వారా మన సమస్యలు తీరుతాయి.

దేవుని వాక్యంమే దేవుని ఆయుధం మరియు దేవుని ఆయుధం దేవుని శక్తి. అందువల్ల మనము వాక్యాన్ని తెలుసుకోవాలి మరియు దానిని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి. వాక్యాన్ని తెలుసుకున్నంత మాత్రాన అది సరిపోదు. మనం వాక్యాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవాలి. కాబట్టి కేవలం వాక్యాన్ని తెలుసుకునే పనిలోనే ఉండకుండా, వాక్యాన్ని మన జీవితంలో సరిగ్గా ఉపయోగించడం కూడా నేర్చుకుందాం.

 2 కొరింథీయులకు 10: 3-4

మేము శరీరధారులమై నడుచు కొనుచున్నను శరీరప్రకారము యుద్ధముచేయము.౹ మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై యున్నవి.

కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది, (నేను అప్పుడప్పుడే యేసు గురించి తెలుసుకున్నాను). అనారోగ్యంతో ఉన్న వ్యక్తికోసం ప్రార్ధించాలని కొంతమంది అపరిచితులు నన్ను పిలిచారు మరియు నేను అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ వ్యక్తి ఒక దెయ్యం పట్టినవాడువలె ఉండడం చూసాను. నేను వారి ఇంటికి ప్రవేశించిన వెంటనే అతను నా వైపు పరుగెత్తుకొచ్చాడు. నేను దేవుని వాక్యాన్ని, దెయ్యం మీద నాకువున్నా అధికారాన్ని జ్ఞాపకం చేసుకొని, ” యేసు నామంలో, దురాత్మా వదిలిపో ” అని అరిచాను. అతను నా పాదాలవద్ద ఒక విమానం ల్యాండ్ అయినట్టుగగా కిందకు పడిపోయాడు. నా చుట్టూ ఉన్న జనం కంటే నేనే చాలా ఆశ్చర్యపోయాను.

మన జీవితమంతా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటె, ఒక సమస్య నుండి మరొక సమస్యలోకి వెళ్తామే కానీ, విడుదల ఉండదు. మనలో వున్నా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమి చేయలేక ఊరుకుంటాడు. ఎందుకంటే అతను మనకు ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించకపోతే అతను ఏమీ చేయలేడు. దేవుని వాక్యం మీలో మరియు మీ ద్వారా పనిచేయకుండా, దేవుడు ఏమీ చేయలేడు.

🛐ప్రార్థన:🛐
యేసయ్య, మీ మాకిచ్చిన అధికారం మరియు శక్తితో నడవడానికి నాకు సహాయం చెయ్యండి. యేసు నామంలో, ఆమేన్

No comments: