ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. – కీర్తనలు: 19:1

నేడు దిన ధ్యానము:-
🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
 
 ✝️*ప్రకృతి దేవుని మహిమపరుస్తున్నది*✝️

🌌ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
   – కీర్తనలు: 19:1   

సాధారణంగా యాత్రికులు రెండు రకాల స్థలాలను దర్శిస్తారు, మొదటిగా ప్రకృతి అందచందాలు చూపే స్థలాలను, రెండవదిగా చారిత్రాత్మక స్థలాలను, అంటే ఎక్కడైతే పురాతన రాజులు, చక్రవర్తులు జీవించారో అటువంటి స్థలాలు. మొదటిది దేవుడు చేసిన ప్రకృతి అందాలను చూపి ఆయనకు మహిమను తెస్తుంది. రెండవది రాజుల భవనాలు, కట్టడాలు చూసి వారికి మహిమను తెస్తుంది. ఎంత గొప్ప రాజైన, ఎంతటి పరాక్రమవంతుడైన, చక్రవర్తి అయిన, వారు నిర్మించిన కట్టడాలు, ప్రపంచాన్ని, విశ్వాన్నంతటినీ పరిపాలించే దేవుడి సృష్టికి ఏమాత్రం సరికావు.

గ్రహాలు, అంతరిక్షంలోని నక్షత్రాలు, పాలపుంతలు, తోకచుక్కలు, పర్వతాలు, లోయలు, పచ్చిక బయలులు, జలపాతాలు, పక్షులు, జంతువులు, అందమైన పువ్వులు, తీయటి పళ్ళు, ఆరోగ్యవంతమైన కూరగాయలు, ధాన్యాలు, కీటకాలు, సీతాకోక చిలుకలు, ఇంకా సరీసృపాలు, ఇవన్నీ ఆ సృష్టికర్త చేసిన అందమైన సృష్టి. ఆ సృష్టికర్త చేసిన మానవుడు, తాను చేసిన ఏ వస్తువులతోనూ సరిపోల్చదగిన వాడు కాడు. మనము సాగిలపడి నమస్కారము చేసి, ఈ సృష్టిని నిర్మించిన దేవున్ని మన హృదయపూర్వకంగా స్తుతిద్దాం.

🛐ప్రార్థన:
తండ్రీ, మీరు చేసిన మీ సృష్టిని దృష్టిoచిన్నప్పుడు, మీరు ఎంత గొప్ప వారు, ఎంతటి శక్తిమంతులో కొద్దిగా అర్థం అవుతుంది. మా హృదయాలు అన్నింటినీ ఉపయోగించి మీ మహిమను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే కూడా అది అసాధ్యమే. మా తలలు వంచి మిమ్ములను ఆరాధిస్తు యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్.

ప్రకృతిలోనూ, జంతువులలోను, పక్షులలోను, ఇంకా వాతావరణంలోనూ నేను దేవుని కనుగొనగలను. - పాట్ బక్ లీ.

No comments: