పరిశుద్ధాత్ముడు మీకు భోదించును

🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము⛪

✝️(పరిశుద్ధాత్ముడు మీకు భోదించును)✝️

మీరేమి చెప్పవలసినదియు, పరిశుద్దాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను.
 లూకా 12:12.

ఒక్కొక్కసారి మనము కొన్ని సంఘటనలను ఎదుర్కొంటుంటాము. ఎలాగంటే, మామూలుగానే సంఘ ఆరాధనకు వెళ్లి కూర్చుంటాము. ఉన్నట్లుండి ఎవరైనా మనలను ముందుకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడమంటారు. అలాంటి సందర్భాలలో ఏమి చేయగలము? నేనైతే, “పరిశుద్దాత్మ దేవా, ఏమి మాట్లాడాలో బోధించండి” అని ప్రార్థిస్తాను. ఒక్కొక్కసారి మనం ముందుగానే, సిద్ధపరచుకొన్న వర్తమానాలు, అనేక రోజుల ముందే సిద్ధపరచుకున్న వర్తమానాల కంటే ఎక్కువగా ఈ వర్తమానాలు మంచి ఫలితాలనిస్తాయి. ఇది పరిశుద్దాత్మ పనియే తప్ప మరొకటి కాదు. యేసు ప్రభువు అనేక మంది కూడిన జనసమూహములతో మాట్లాడుతున్నారు. వాళ్లు తొక్కిసలాడసాగారు. మొదట తన శిష్యులతో అనేక విషయాలు మాట్లాడారు. ఆ సందర్భములో ఆయన దేహమును చంప శక్తి గల వారికి భయపడవద్దని చెప్పారు. కానీ నరకంలో పడద్రోయగల శక్తి గల వారికి భయపడుమని చెప్పారు. ఇంకా ఆయన “వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును, అధిపతుల యొద్దకును, అధికారుల యొద్దకును మిమ్మును తీసికొనిపోవునప్పుడు మీరు – ఏలాగు ఏమి ఉత్తరమిచ్చెదమా, ఏమి మాట్లాడుదుమా అని చింతిపకుడి. మీరేమి చెప్పవలసినదియు పరిశుద్దాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను.” కనుక మనలను చంపగలిగిన వారికి మనము భయపడకుందాము కానీ దేవునికి భయపడి, ఆయా సందర్భాలలో ఏమి మాట్లాడాలో దానికి సరిపోయినట్లుగా, సరియైన మాటలనిచ్చునట్లు, సంపూర్ణంగా పరిశుద్దాత్మ దేవుని పైన ఆధారపడుదాము.
ప్రార్థన:
ప్రియ పరిశుద్దాత్మ దేవా, మేము జీవితంలో ఎదుర్కొనే ప్రతీ పరిస్థితి లోనూ ఏమి మాట్లాడాలో, ఏమి చేయాలో అని మాకు బోధించండి. మీ అద్భుతమైన నడుపుదలకు మీకే వందనాలు యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

👉పరిశుదాత్మకు ప్రార్థించడమంటే, మనము ప్రార్థించేటపుడు ఆయన దైవికమైన సహాయము పైన ఆనుకోవడమే, ఇంకా ఆధారపడడమే. – విలియం త్రాషెర్

No comments: