కృప వెంబడి కృప


నేడు దిన ధ్యానము:-
🙏ప్రభువు నామములో అందరికి శుభోదయం🙏
⛪*కృప వెంబడి కృప*⛪

ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు. 
– యోహాను: 1:16

యేసు ప్రభువు తన శిష్యుడైన యోహానును చాలా ప్రేమించారు. కనుకనే తన తల్లి బాధ్యతలను పరిశుద్ధ యోహానుకే అప్పగించారు. ఆయనకు, యోహాను తప్పకుండా తన తల్లిని చూసుకుంటాడన్న నమ్మకం ఉండింది. యోహాను తండ్రియైన దేవుని ప్రేమను, కృపను యేసు ప్రభువు ద్వారా అనుభవించాడు. కనుక యేసు ప్రభువు గురించి అద్భుతమైన వివరణ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో రాశాడు. “వాక్యము శరీరధారియై యేసు ప్రభువుగా మన మధ్యకు వచ్చెను”, అని అతడు వ్రాశాడు. ఇంకా “యేసయ్య లోకానికి వెలుగు కూడా” అని వ్రాశాడు. యేసయ్యలో జీవము ఉంది . ఇంకా 12 వ వచనములో “ఆయనను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడినదని” వ్రాశారు. “వారు దేవుని వలన పుట్టారు కానీ రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను, పుట్టినవారు కారు”. చివరగా 16 వచనంలో, “ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు”, అని వ్రాశాడు.

కృప మరియు సత్యము యేసయ్య నుండి వచ్చినవి. అవును పరిశుద్ధ యోహాను వ్రాసినట్లు, మనమందరము కృప వెంబడి కృపను, ఇంకా కృపను, ఇంకా కృపను పొందుకుంటున్నాము. కృపకు కొలతలు లేవు. మన పాపానికి ఎంత పెద్ద కొలతలు ఉన్నప్పటికీ, యేసు ప్రభువు ద్వారా ఉచితంగా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవమునకు వారసులు అయ్యాము. ఎంత గొప్ప ఆదిక్యత! యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి, నిరంతరం ఆయనలోనే నిలిచిఉందాము.

🛐ప్రార్థన:

ప్రియ ప్రభువా, నీ నుండి మేము కృప వెంబడి కృపను పొందుకున్నాము, మా అద్భుతమైన రక్షకుడైనందుకు మీకు వందనాలు. మీ కృపలో నిరంతరము నిలిచి ఉండుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్!

యేసుప్రభువును ప్రేమించడంలో మనం చేసిన విఫల ప్రయత్నాల మధ్య, ఆయన కృప మనలను దాచి ఉంచుతుంది. – ఫ్రాన్సిస్

No comments: