Sharanu Sharanu Deva Sharanu O Deva | శరణు శరణు దేవ శరణు ఓ దేవా

శరణు శరణు దేవ శరణు ఓ దేవా
శరణుజొచ్చితి రమ్ము కరుణతో బ్రోవ

1. పాపేచ్చలతో నేను పలు బాధలొందితి
మరి చేయునది లేక మార్గంబు దప్పితి
వలదు వలదీలోక వాంఛలన్నియు భ్రమర
శరణు శరణు నాదు శ్రమలన్ని బాపరా 

2. శోధనలు నను చుట్ట ఆదరణ లేకయే
నాధ నీ భోదను కాదనుచు ద్రోసితి 
కాదుగా నా ఎదను సిలువపై దీర్చితి
పాదములు పైబడితి భ్రాంతులను ద్రుంచరా 

3. నీ ఆత్మ కాంతితో నన్ను వెలిగించరా
నీ వాక్య శక్తితో నన్ను ధృడపరచారా
నీ కృపతో ఇల నన్ను పిలచీ దీవింపరా
నిరతంబు నీ ప్రేమ నా యందు నిలుపరా 

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: