Raathriyayyena Nnedabayaku | రాత్రియయ్యెన న్నెడబాయకు

56 
Abide with me, fast falls the eventide

1. రాత్రియయ్యెన న్నెడఁబాయకు 
    ధాత్రి పైఁ జీఁకటులుఁ గ్రమ్మెను 
    సహాయ మేమి లేనివారికి 
    సహాయుఁడా, నన్బాసిపోకుమా.

2. ఏకాలంబైన నీ సహాయము 
    లేక పిశాచిన్ గెల్వఁజాలను 
    నీకంటె నాకు లేదుగా 
    లోక ప్రకాశుఁడా , నన్బాయకు.

3. నా చెంత నీవు చేరియుండఁగ 
    ఏ చింతయైన నన్ను సోకునా 
    ఏ శత్రువైన నన్ను గెల్చునా ? 
    నా శైలమా , నన్బాసి పోకుమా.

4. సమృద్ధుఁడు సహాయుఁ డాయెను 
    ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా ? 
    సమాధి నీకు జయమబ్బునా ? 
    మా మధ్యమున్ సర్వేశ పాయకు .

5. రేవు నేఁ జేరఁబోవు వేళలో 
    కావుమయ్యా నీ దీప్తిఁ జూపుచు 
    చావు జీవంబులందు నైనను 
    నీవు తోడై నన్బాసిపోకుము .
                           - హెన్రీ ప్రాన్సిస్ లైట్ 
      – అను : ఆల్ ఫ్రెడ్ త్యాగరాజు పామర్

No comments: