Yehova Aasheervadamu Neemeeda | యెహోవా ఆశీర్వాదము నీమీద నుండును

యెహోవా ఆశీర్వాదము నీమీద నుండును గాక 
యెహోవా యెక్క ప్రసన్నత నీ పైన నిలుచును గాక యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆదుకొను గాక యెహోవా దేవుని నామము నిన్నుద్దరించు గాక 
యెహోవా నీ ప్రాకారములో నెమ్మది కలిగించును గాక యెహోవా నీ నగరులలో క్షేమమునుంచును గాక 

2. యెహోవా నీదు దహనబలులు అంగీకరించును గాక యెహోవా నీ నైవేద్యములు ఆఘ్రాణించును గాక 
యెహోవా నీ కోరికను సిద్ధింప జేయును గాక 
యెహోవా నీ ఆలోచన సఫలము చేయును గాక 
యెహోవా ఆపత్కాలమందు నీ కుత్తరమిచ్చును గాక యెహోవా పరిశుద్ధ స్థలమునుండి సహాయము చేయును గాక  

3. యెహోవా నీ శ్రమలన్నిటినుండి నిను విడిపించును గాక యెహోవా నీ భయములనుండి నిను తప్పించును గాక యెహోవా సన్నిధి కాంతి నీపై ఉదయింపజేయును గాక యెహోవా తన ముఖకాంతి నీపై ప్రకాశింప జేయును గాక యెహోవా తన దయచేతనే నీ కొమ్ము హెచ్చించును గాక యెహోవా ప్రభావ గౌరవము ధరింపజేయును గాక 

4. యెహోవా తన దండముతో నిన్నాదరించును గాక యెహోవా నీ శత్రువు ఎదుట భోజనమేర్పరచును గాక యెహోవా తెగులేమి రాకుండా నిన్ను కప్పును గాక యెహోవా నీ రాకపోకలలో నిను కాపాడును గాక 
యెహోవా కలిమి సంపదతో నిన్ను దీవించు గాక 

5. యెహోవా దీర్ఘాయువును నీకు దయ చేయును గాక యెహోవా మేలుతో నీ హృదిని సంతృప్తి పరచును గాక యెహోవా నీ కష్టార్జితము అనుభవింప జేయును గాక యెహోవా రక్షణ వస్త్రముతో అలంకరించును గాక యెహోవా నిత్యము నీమీద సమాధానముంచును గాక ఆమెన్ ( 8 )
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: