Christine Iverson Bennett | క్రిస్టీన్ ఐవర్సన్ బెన్నెట్

📚 *ఒక మిషనరీ జీవిత చరిత్ర* 📚 
🛐 *క్రిస్టీన్ ఐవర్సన్ బెన్నెట్ Christine Iverson Bennett* 🛐

జననం: 04-01-1881
మహిమ ప్రవేశం: 29-03-1916
స్వస్థలం: స్లాగ్‌బల్లె
దేశం: డెన్మార్క్
దర్శన స్థలము: అరేబియా 

      క్రిస్టీన్ ఐవర్సన్ బెన్నెట్ అరేబియా ద్వీపకల్పంలో సేవ చేసిన ఒక వైద్య మిషనరీ. వాస్తవానికి వారు డెన్మార్క్‌కు చెందినవారు అయినప్పటికీ, ఆమె కుటుంబం 1893వ సంll లో అమెరికా దేశానికి వలస వెళ్ళారు. తన బాల్యంలో అనారోగ్యముతో బాధపడటంతో, ఆ అనుభవం వైద్య వృత్తిని చేపట్టేలా క్రిస్టీన్‌ను ప్రేరేపించింది. కాగా మిచిగాన్ విశ్వవిద్యాలయములో వైద్య శాస్త్రమును అభ్యసించిన ఆమె, 1907వ సంll లో డాక్టరేట్ పట్టా పొందారు. మడగాస్కర్‌లో మిషనరీ సేవను గురించిన కథలను విని, వాటి నుండి ప్రేరణ పొందిన ఆమె, ‘ది బోర్డ్ ఆఫ్ ఫారిన్ మిషన్స్’ కు దరఖాస్తు పెట్టుకున్నారు. తద్వారా ఆమె వైద్య మిషనరీగా అరేబియాకు పంపబడ్డారు.

      1910వ సంll లో మరికొంతమంది మిషనరీలతో కలిసి బహ్రెయిన్‌లో అడుగుపెట్టారు క్రిస్టీన్. 1911వ సంll లో ఆర్థర్ కింగ్ బెన్నెట్‌తో ఆమె వివాహంలో జతపరచబడ్డారు. తదుపరి వారిరువురు కలిసి బాస్రాలోని ‘లాన్సింగ్ మెమోరియల్ హాస్పిటల్‌’ లో మిషనరీ సేవను ప్రారంభించారు. క్రైస్తవులను ద్వేషించిన ఆ ప్రజలకు వారు క్రీస్తు ప్రేమను కనుబరిచారు. క్రిస్టీన్ మహిళా రోగులకు చికిత్స నందించగా, ఆమె కలిగియున్న వృత్తిపరమైన నైపుణ్యం మరియు సున్నిత స్వభావం త్వరలోనే అనేక మందిని ఆమె వైపుకు ఆకర్షించాయి. అలుపెరుగని సేవకురాలిగా ఆమె జ్వరం, క్షయ మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలను మధ్యాహ్న సమయంలో వారి గృహముల యొద్ద దర్శించి చికిత్స చేసేవారు. పేద గొప్ప బేధము లేకుండా అందరికీ సమానంగా సేవలందించిన ఆమె, ఎవరినీ కూడా ఏనాడూ వెనుకకు పంపివేయలేదు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలలో తన భర్తకు కూడా ఆమె సహాయం చేసేవారు.

   1914వ సంll లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఈ మిషనరీ దంపతులు గాయపడిన సైనికులకు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అప్పటిలో ఇస్లాం మతోన్మాదం తారాస్థాయికి చేరుకొనగా, యూదులు మరియు క్రైస్తవులు చంపబడుతున్నారు. వారి ప్రాణాలకు అపాయం పొంచి ఉన్నప్పటికీ, ఆ వైద్య దంపతులు గాయపడినవారికి చికిత్స చేయుటకై తమ చర్చి మరియు పాఠశాల భవనములను కూడా తెరిచారు. ఆ సమయంలోనే వారిరువురు కూడా టైఫాయిడ్ జ్వరం బారిన పడి అనారోగ్యానికి గురయ్యారు. మూడు రోజుల తరువాత, 1916వ సంll లో 35 సంll ల లేత ప్రాయములోనే క్రిస్టీన్ పరమ వాస స్థలమును చేరుకున్నారు.

   సువార్త సందేశముతో అరబ్బుల హృదయములను కదిలించుటకై క్రిస్టీన్ చూపిన శ్రద్ధాసక్తులు మాదిరికరముగా నిలుస్తాయి. వైద్యములో తనకున్న నైపుణ్యముతో అరబ్బు మహిళలకు మరియు వారి పిల్లలకు సేవ చేయుటలో ఆమె చూపిన నిస్వార్థమైన సమర్పణ, ఆ సమాజం మొత్తం దేవుని ప్రేమను రుచి చూచునట్లు సహాయపడింది. పవిత్రమైన ఆమె విశ్వాసం, విధి పట్ల కలిగియున్న సమర్పణ మరియు యథార్థత కలిగిన క్రైస్తవ జీవితం ఆమె యొక్క తోటి మిషనరీలలో అనేక మందికి స్ఫూర్తినిచ్చాయి.

        🚸 *ప్రియమైనవారలారా, మీరు కలిగియున్న నైపుణ్యములను మానవాళి యొక్క ప్రయోజనం కొరకు మీరు ఉపయోగిస్తున్నారా?* 🚸

🛐 *"ప్రభువా, నిర్మలమైన మనస్సుతోను, స్వచ్ఛమైన ఉద్దేశ్యములతోను మీకును మరియు తోటి మనుష్యులకును నేను సేవ చేయగలుగునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐
*******

    *ఒక మిషనరీ జీవిత చరిత్ర* ద్వారా మీరు ప్రయోజనం పొందినట్లయితే, ఇతరులు కూడా ప్రయోజనం పొందులాగున దీనిని అందరికీ పంపి, *ప్రభువును సేవించుటకు* వారిని ప్రోత్సహించ మనవి!
*******
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
*******
తెలుగు అనువాదం: ఆర్. ఆర్. ప్రియాంక

No comments: