నాకున్నవన్నీయు.. నీవే యేసయ్య (2)
నా ప్రాణమా.. నా ధ్యానమా -
నా ఊపిరి.. నీవే యేసయ్య ||నీవు||
1.జాలిలేనిది.. ఈ మాయలోకము -
కలతచెందెను.. నా దీన హృదయము (2)
నను కాపాడుటకు.. నాదరి నిలచితివా -
హస్తము చాపితివా - నను బలపరచితివా(2) ||నా ప్రాణమా||
2.నను ప్రేమించేవారు.. ఎందరు ఉన్నను -
అంతము వరకు.. నాతో ఉండరు (2)
నాలో ఉన్నవాడా.. నాతో ఉన్నవాడా -
నా ప్రాణము నీవే యేసయ్య (2) ||నా ప్రాణమా||
3.కన్నులు మూసిన ..కన్నులు తెరచిన -
నా చూపులలో.. నీ రూపమే (2)
కనికరించితివా.. కరుణామయుడా -
కృప చూపించితివా - నాకు చాలిన దేవుడా (2) ||నా ప్రాణమా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment