Raavayya yesunadha రావయ్య యేసునాధా

323
క్రీస్తు పశ్చాతాతపము 
రా - అఠాణ, తా - ఆది

రావయ్య యేసునాధా - మా - రక్షణ మార్గము - నీ = సేవ జేయ మమ్ము జేపట్టుటకు ||రావయ్య||

1.హద్దు లేక మేము - ఇల - మొద్దులమై యుంటిమి - మా = కొద్ది బుద్ధులన్ని దిద్దిరక్షింపను ||రావయ్య||

2.నిండు వేడుకతోను - మమ్ము - బెండువడక చేసి - మా = గండంబు లన్నియు - ఖండించుటకు ||రావయ్య||

3.మేరలేని పాపము - మాకు భారమైనమోపు - నీవు = దూరంబుగా జేసి దారి జూపుటకు ||రావయ్య||

4.పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను - మా = పాపంబులన్నియు - పారదోలుటకు ||రావయ్య||

5.అందమైన నీదు - పరమానంద పురమందు - మే = మందరము జేరి యానందించుటకు ||రావయ్య||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: