173
యేసుని ప్రేమ స్మరణ
రా - శంకరాభరణం, తా - ఆది
యేసుని ప్రేమను - నేమారక ను - నెప్పుడు దలచవే యో మనసా = వాసిగ నాతని - వరనామంబును - వదలక పొగడవె యో మనసా ||యేసుని||
1.పాపులకొరకై ప్రాణము బెట్టిన - ప్రభు నిల దలచపవె యో మనసా = శాపము నంతయు - జక్కగ నోర్చిన - శాంతుని పొగడవ యో మనసా ||యేసుని॥
2.కష్టములలో మన - కండగ నుండిన - కర్తను దలచవె యో మనసా = నష్టము లన్నియు - నణచిన యాగురు - శ్రేష్ఠుని పొగడవె యో మనసా||యేసుని||
3.మరణ తరిని మన - శరణుగ నుండెడు - మాన్యుని దలచవె యో మనసా = కరుణను మన క - న్నీటిని దుడిచిన - కర్తను పొగడవె యో మనసా||యేసుని॥
4.ప్రార్థనలు విని - ఫలముల నొసంగిన - ప్రభు నిక దలచవే యో మనసా = వర్థన గోరుచు - శ్రద్ధతో దిద్దిన - వంద్యుని పొగడవె యో మనసా||యేసుని॥
5.వంచనలేక - వరముల నొసగిన - వరదుని దలచవె యో మనసా = కొంచెము కాని - కూర్మితో దేవుని - కొమరుని పొగడవె యో మనసా ||యేసుని||
- దొరసామి ఆరోగ్యము
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment