Parishudhathmanu Gorumu | పరిశుద్ధాత్మను గోరుము

243    
పరిశుద్ధాత్మకొరకైన మన యక్కర
 రా - కళ్యాణి,  తా - త్రిపుట

పరిశుద్ధాత్మను గోరుము - జీవమ యేసు - ప్రభుని పేరట వేడుము - నరులందరిమీద - నా యాత్మ నుంతునని - పరలోకపు తండ్రి - పలికె  వేదము నందు ||పరిశుద్ధాత్మను||

1.పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ - పఠన పఠనము గాదది = నెర చీకటింట సర - కులు వెదకు రీతి - పల్మరు వెదకినను నిర - ర్ధకమై పోవును వేగ ||పరిశుద్ధాత్మను||

2.పరిశుద్ధాత్మ లేనిది - వర్షము లేని - పైరు చందంబే యది = పరబోధకముల వ - ర్తితమైన పనులు జీ - వ రహితములై యను - భవము గానివై యుండు ||పరిశుద్ధాత్మను||

3.పరిశుద్ధాత్మ లేనిది - యేసు ప్రభుని - నెఱుగు టెఱుగుట గాదది = నరరూపు దాల్చి దు - ర్నరుల రక్షణకొరకు మరణ మొందిన ప్రభుని - కరుణాధికము వడయు ||పరిశుద్ధాత్మను||

4.పరిశుద్ధత్మ లేనిది - జీవము లేని - బ్రతుకే బ్రతుకు గాదది = దురి తేచ్ఛ లను గొప్ప - యురులం దగిలి భక్తి తరిగి పోవుట కద్ది - దొరకనందున సుమ్ము ||పరిశుద్ధాత్మను||

5.పరిశుద్ధాత్మ బొందుట - అన్నిటి కన్న - ప్రబలంబైన మేలిట = నెర నమ్మి మొఱ బెట్టు - పరమ పావను డద్ది - కరుణించి నీ కొసగు - మరణాంత మగు దనుక  ||పరిశుద్ధాత్మను||
                                 - బేతాళ జాన్
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: