393
క్రీస్తుని ఆశ్రయించుట
రా - శహన, తా - కరుజంపె
నీ చరణములే నమ్మితి నమ్మితి - నీ పాదములే పట్టితి బట్టితి బట్టితి ||నీచరణములే||
1.దిక్కిక నీవే చక్కగ రావే = మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీచరణములే||
2.ఐహిక సుఖము - నరసితి నిత్యము = అహాహా ద్రోహిని ద్రోహిని ద్రొహిని ||నీచరణములే||
3.న్యాయము గాని - నాక్రియలన్ని - రోయుచు ద్రోయకు త్రోయకు త్రొయకు ||నీచరణములే||
4.భావము మార్చి నా వెత దీర్చి = దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీచరణములే||
5.చంచల బుద్ది - వంచన యెద్ది - ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీచరణములే||
6.చుట్టుకొని యున్న - శోధన లున్నఁ = పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీచరణములే||
7.నాచు పిశాచి - నరకుట గాచి = కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే||
8.యేసుని తోడ - నెవ్వరు సాటి = దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే||
- పురుషోత్తము చౌదరి
_________________________________
Nee charanamule nammithi nammithi - Nee paadamue pattithi battithi battithi
1.Dikkika neeve chakkaga raave = mikkili mrokkudu mrokkudu mrokkudu ||nee chara||
2.Ihika sukhamu narasiti nithyamu = ahaha dhrohini dhrohini dhrohini ||nee chara||
3.Nyamua gaani naa kriyalanni = royuchu dhroyaku throyaku throyaku ||nee chara||
4.Bhavamu maarchi naa vetha dheerchi = Devara provave provave provave ||nee chara||
5.Chanchala bhuddhi vanchana yeddhi = Unchaka thrunchave thrunchave thrunchave ||nee chara||
6.Chuttukoni yunna shodhana lunna = Pattuvida gottave kottave kottave ||neechara||
7.Naachu pichaasi - narakuta gaachi = Kaachuko daachave daachave daachave ||nee chara||
8.Yesuni thoda nevvaru saati = Dosamu baapunu baapunu baapunu ||nee chara||
- Purushothamu choudari
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment