Trahimam Kristhu Naadha | త్రాహిమాం క్రీస్తు నాద

313
పశ్చాత్తాప ప్రార్ధన
రా - యదుకుల కాంబోజి,  తా - ఆది

  ¹త్రాహి ²మాం క్రీస్తు నాధ - దయ జూడ రావే = నేను - ³దేహీ యనుచు నీ పాదములే - దిక్కుగా జేరితి నిపుడు ||త్రాహి||

1.గవ్వ చేయరాని చెడ్డ - కర్మేంద్రియ దీనుడనై - ⁴రవ్వ పాలై  నేనెంతో ⁵నెవ్వ బొందితి - త్రవ్వుచున్న కొలది - పెరుగు - దరగదు నా పాప రాశి - యివ్విధమున  జెడిపోతినినే - నేమి సేతు నోహో హోహో ||త్రాహి||

2.నీ యందు భయభక్తులు లేని - ⁶నిర్లజ్జ చిత్తము బూని - చేయరాని దుష్కర్మములు - చేసినాడను = దయ్యాలరాజు చేతిలో - జేయివేసివాని పనుల - జేయ సాగి నే ⁷నిబ్బంగి - జెడిపోయితి నేనయ్యయ్యయో ||త్రాహి||

3.నిబ్బర మొక్కించుకైన - నిజము రవ్వంతైన లేక - దబ్బర లాడుటకు ము - త్తా నైతిని = అబ్బుర మైన ఘోర పా - పాంధకార కూపమందు - దబ్బున బడిపోతి నయ్యో - దారి చెడి నేనబ్బబ్బబ్బా  ||త్రాహి||

4.నిన్ను జేరి సాటిలేని - నిత్యానంద మందబోవు - చున్న ప్పుడు నిందలం నా - కెన్ని చేరినా = విన్నద నము లేకుండ నీ - వే నామదికి ధైర్యమిచ్చి - యన్నిట రక్షించి తివి నా - యన్న నీకు స్తోత్ర మహహా ||త్రాహి||
                               - పురుషోత్తమ చౌదరి
___________________________________
¹రక్షించుము. ²నన్ను. ³ఇమ్ము.  ⁴అపకీర్తి. ⁵ఆపద.  ⁶సిగ్గులేని మనస్సు. ⁷ఈ విధమున
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: