Daivathma parishudhuda dharala దైవాత్మ పరిశుద్ధుడా ధారాళ

242
Come Holy Spirit Heavenly Dove

1.దైవాత్మ పరిశుద్ధుడా 
ధారాళ ప్రేమను 
దండిగ నిచ్చి మమ్మును 
దయన్ దీవించుము.

2.మా యజ్ఞానాంధకారము 
వ్రయము జేయుము 
నీ యెక్కువైన తేజము 
మా యందు పోయుము.

3.మా దర్గుణంబు లెల్లను 
చెదరఁ గొట్టుము 
మా పాప మణుపుటకై 
నీ శక్తిఁ జూపుము.

4.సన్మార్గమందు నిత్యము 
మమ్ము నడుపుము 
నీ మోక్షమందు పిమ్మట 
మమ్మాదరింపుము.
- ఐజాక్ వాట్స్ 
అను: జాన్ స్మిత్ వార్డ్ల్ 

Divya pavanathma nee yeevulanni దివ్య పావనాత్మ, నీ యీవు

241
Gracious Spirit, Holy Ghost

1.దివ్య పావనాత్మ, నీ 
యీవు లన్ని మంచివి 
నీదు ముఖ్యదానమీ 
-దివ్య ప్రేమయే-

2.ప్రేమ దయచూపును 
ప్రేమ దీర్ఘశాంతము 
మృతికన్న బలము 
-దివ్య ప్రేమయే-

3.కాలజ్ఞాన మంతయు 
కొట్టి వేయబడును 
ప్రేమ నిత్య ముండును 
-దివ్య ప్రేమయే-

4.దృష్టిగా విశ్వాసము 
మాఱఁగా నిరీక్షణ 
యనుభవమౌఁ గాని 
-దివ్య ప్రేమయే-

5.విశ్వాస నిరీక్షణ 
ప్రేమ లీ మూడుండును 
కాని శ్రేష్ఠమయినది 
-దివ్య ప్రేమయే-

6.పావనాత్మ! స్తోత్రము 
నీకుఁ జేయు వారము 
మాకు దయచేయుము 
-దివ్య ప్రేమయే-
- క్రిస్తఫర్ వర్డ్స్ వర్త్
అను: బర్నార్డ్ లూకాస్

Sri yesu swami thirigi mokshanbu శ్రీ యేసు స్వామి తిరిగి మోక్షంబుఁ

240 
Our Blest Redeemer, ere He Breathed

1.శ్రీ యేసు స్వామి తిరిగి 
మోక్షంబుఁ జేరగా 
ఒక్కాదరణకర్తను 
ఒసంగెను.

2.ఆ దేవునాత్మ ప్రీతిగా 
మదిన్ వసించుచు 
విధేయులైన మనల 
పాలించును.

3.సద్గుణ మున్న మనకు 
ఆ యాత్మ దానము 
శోధించు దుష్టుని సహా 
జయించును.

4.ఓ దేవునాత్మ, మమ్మును 
విశుద్ధిపర్చుము 
మా హృదయంబులో సదా 
వసించుము.
- హేరియట్ హబర్
అను: జాకబ్ చాంబర్లీన్

Daivathma digumu dasula దైవాత్మా దిగుము దాసుల పైని

238
పరిశుద్ధాత్మ కొరకు వేడుట 
(చాయ: యేసు క్రీస్తుని గొల్వరన్న)
రా - మూఖరి, తా - ఆది 

దైవాత్మా దిగుము దాసుల పైని - నీ దయా దృష్టిఁ - పారజేయుము ప్రేమన్ నింపు = దేవా యాత్ముండ దిగుము మమ్ముల - శుద్ధీకరించుము - దయారసముచే ||దైవాత్మా||

1.దైవాత్మా దిగుము ప్రవక్తలు - పూర్వంబు నీదు -  ప్రేరణవలనఁ బ్రవచించిరి = పావురమా దిగి - మాలో వసించుము - పాపుము చీఁకటి - వెలుఁగుచు మాలో ||దైవాత్మా||

2.రమ్ము ఓ యున్నతంపు ఆత్మా - నాలుగు దెసల-నుండి మమ్ముల నావ రించు = రమ్ము రమ్ము దిగి యెండిన యెముకలు- గానగు లోకుల - మీదికి ముదమున ||దైవాత్మా||

3.మే మజ్ఞానాంధకారమునను - మునిఁగితిమి గాన - చెదరఁగఁజేయు మంధకారము = పామర జనులకుఁ బేర్మి-తో నొసఁగు ను - జ్ఞాన ప్రకా శము - నిల్పుము మాలో ||దైవాత్మా||
- మామిళ్ళ యెషయా

Parishudhathma nithyathma పరిశుద్ధాత్మ నిత్యాత్మ

237
పరిశుద్ధాత్మ స్తుతి 
రా - బిలహరి,  తా - అట 

పరిశుద్ధాత్మ నిత్యాత్మ - పరమ పావురమా =  దురతేచ్ఛలను దూర - పరచు సత్యాత్మా ||పరిశుద్ధాత్మ||

1.నిత్యంపు వెల్గుచే - నింపు జ్ఞానాత్మ = సత్యంపు శుభ వార్త - సంధించు నాత్మ ||పరిశుద్ధాత్మ||

2.జీవమార్గంబున - జీవింప నేర్పి = త్రోవఁ దప్పిన వారి - భావంబు మార్చు ||పరిశుద్ధాత్మ||

3.పాపాంధకారంబుఁ - బాపు నీ వెలుఁగుఁ = జూపి మింటికి నడిపి - కాపాడి మెలఁగు ||పరిశుద్ధాత్మ||

4.భక్తుఁడు శోధింపఁ - బడుచుండునేని = యుక్తిఁ దెల్పెడి సర్వ - శక్తి నీదౌను ||పరిశుద్ధాత్మ||

5.తిన్ననైన తెలివి - తేట నాకిమ్ము = నిన్ను సేవించెద - నిజము స్తోత్రమ్ము ||పరిశుద్ధాత్మ||
- బేతాళ జాన్

Reyi pagalu nee padaseve రేయి పగలు నీ పదసేవే

686
రేయి పగలు నీ పదసేవే - 
జీవదాయకమే చేయుట మేలు -
సాటిలేని దేవుడ నీవే - 
నాదుకోట కొండయు నీవే (2)

1.పరమపురిలో దేవా నిరతం - 
దూత గణములు స్తుతులను సల్పి 
శుద్దుడు పరిశుద్ధు డనుచు - 
పూజ నొందే దేవుడ నీవే (2) ||రేయి||

2.జిగటమన్నే మరచి జనులు - 
సృష్టినే పూజించుట తగునా 
సృష్టికర్తను మరచి జనులు - 
సృష్టినే పూజించుట తగునా (2) ||రేయి||

3.పెంట కుప్పల నుండి దీనుల - 
పైకిలేపు ప్రభుడవు నీవే 
గర్వమణిచి గద్దెలు దింపి - 
ఘనులనైనా మేపవా గడ్డి (2) ||రేయి||

4.నరుల నమ్ముటకంటె నిజముగ - 
నీదు చరణం శరణం దేవా
రాజులను ధరనమ్ముటకంటె - 
రాజ రాజవు నాకాశ్రయము (2) ||రేయి||

5. అగ్నివాసన నంటకుండా - 
అబెద్నగోలతో నుండిన దేవ
దానియేలును సింహపు బోనులో - 
ఆదుకున్న నాథుడ నీవే (2) ||రేయి||

6.పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - 
పరము జేర్చే పథము నీవే
అడుగు జాడలో నడచిన హనోకు - 
పరముచేరే ప్రాణము తొడ (2) ||రేయి||

7.మృతుల సహితము లేపినావు - 
మృతిని గెల్చి లేచినావు
మృతులనెల్ల లేపేవాడవు - 
మృత్యువును మృతి జేసితి నీవు (2) ||రేయి||
___________________________________
Reyi pagalu nee padaseve - 
jeevadayakame cheyuta melu - 
saatileni devuda neeve - 
naadu kota kondayu neeve (2) ||Reyi||
     
1.Paramapurilo deva niratham - 
dootha ganamulu sthuthulanu salpi -
Suddudu pari suddhudanuchu - 
pooja nonde devuda neeve (2) ||Reyi||

2.Jigatamanne marachi janulu - 
shrushtine poojinchuta thaguna - 
srushtikarthanu marachi janulu - 
shrushtine poojinchuta taguna(2) ||Reyi|| 

3.Pentakuppala nundi deenula - 
paikilepu prabhudavu neeve - 
garvamanichi gaddelu dhimpi - 
ghanulanainaa mepavaa gaddİ  ||Reyi|| 

4.Narula nammutakante nijamuga - 
needu charanam saranam devaa - 
raajulanu dhara nammutakante - 
raajaraajavu nakasrayamu (2) ||Reyi||

5.Agni vasana nantakunda - 
Abednagolatho nundina deva - 
daaniyelunu simhapu bonulo - 
aadukunna naadhuda neeve (2) ||Reyi||

6.Parama gurudavu prabhulaku prabhudavu -paramu jerche padhamu neeve - 
adugu jaadalo nadachina Hanoku - 
paramu chere praanamu toda (2) ||Reyi||

7.Mruthulu sahithamu lepinaavu - 
mruthini gelchi lechinaavu - 
mruthulanella lepevadavu - 
mruthyuvunu mruthi jesithi neevu (2) ||Reyi||
DOWNLOAD MP3 SONG HERE 👇

Uhinchalenayya vivarinchalenayya ఊహించలేనయ్యా వివరించలేనయ్యా


ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను (2)
నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)
తరియించు వరమే దొరికెను (2) ||ఊహించ||

1.నా మనసు వేదనలో - నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో - తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను (2) ||ఊహించ||

2.నీ మరణ వేదనలో - నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో - అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను (2)
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ||

Ninnu nammi vacchi ne siggu chendhaledhu నిన్ను నమ్మి వచ్చి, నే సిగ్గుచెందలేదు


నిన్ను నమ్మి ఏమి - నే సిగ్గుచెందలేదు
నిన్ను నమ్మి వచ్చి - ఏమి సిగ్గుచెందలేదు

నిన్ను నమ్మి ఏమి - నే సిగ్గుచెందలేదు
నీ దయ నన్ను చేయి విడువ లేదు
వట్టి చేతితో వచ్చితిని - రెండు పరివారాలనిచ్చితివే (2)

ఏల్‌-ఎలోహేయి ఏల్‌-ఎలోహేయి ఏల్‌-ఎలోహేయి
నిన్నే స్తుతింతున్..

గాయపడ్డాను - కన్నీళ్లు కార్చాను
కలతచెందిన నన్ను కరుణించావు
నిబంధనను నాతో చేసితివే
కోల్పోయినవన్నీ ఇచ్చితివే (2) ||ఏల్‌||

ప్రియులందరు విడిచి పోయినా
ప్రియమైనవన్నీ నాకిచ్చితివే (2)
పరదేశిగా నేనున్న చోటే
స్వాస్థ్యముగా నాకు మార్చితివే ||ఏల్‌||

Vishwasamutho vededi variki విశ్వాసముతో వేఁడెడి వారికి

388
విశ్వాస ప్రార్థన 
(ఛాయ: మనసానందము) 
రా - సౌరాష్ట్ర, తా - ఆది 

విశ్వాసముతో - వేఁడెడి వారికి - విశ్వ మంతయును - వీల్పడును = శాశ్వత రాజ్య - థీశ్వరుఁ డాఢ్యుఁడు - శాశ్వత మగు నీ - శాసన మె చ్చెను ||విశ్వా||

1.బిడ్డలు తండ్రుల - వేడఁగ నన్నము - బెడ్డ లిచ్చు వె - ఱ్ఱులు గలరే = దొడ్డ తండ్రి నిలఁ - దోడ్పా టడిగిన - నడ్డులేక విమ - లాత్మ నొసంగును ||విశ్వా||

2.నమ్మకమునఁ జెడు - నరులను గానము - నమ్మక చెడుదురు - నరులయ్యో = ఇమ్మహి సకల శు - భమ్ములు గలుగును - సమ్మతి వెతకఁగ శాశ్వత రాజ్యము ||విశ్వా||

3.వెతకెడు వారికి - వెసఁ గృపఁ జూపును - గతిఁ గని వేడం - గాఁ దెర చున్ = సతతము యేసుని - చక్కని పేరట - హిత మతి వేఁడగ - నెంత యు మేలగు ||విశ్వా||

4.బల మేమియుఁ గనఁ - బడ దాహ నే సలిపెడు భక్తిని - సతి మను చు = నలయకు నేలను - నావగింజ మరి నిలిపినఁ జెట్టయి - నింగికి నెదుగదె ||విశ్వా||

5.అవిశ్వాసమున - నతి భీతులచే - నవిసి క్రుంగ నగు - నే మనసా = భువిఁ బాపాత్ములఁ - బ్రోచెడు ప్రభు కృపఁ - జవిఁ జూడుము నుతి - సల్పుచు వేగమే ||విశ్వా||
- ఎ. జెకర్యా 

Paschatapamu bondumu పశ్చాత్తాపము బొందుము

333
పశ్చాత్తాప పడుటకు ప్రేరణ
(చాయ: పరిశుద్ధాత్మను గోరుము)
రా - ఆనంద భైరవి, తా - అట

పశ్చాత్తాపము బొందుము - జీవమ నీవు - ప్రభుని సన్నిధి కేగుము = పశ్చాత్తాపములేని - ప్రజలెవ్వరికి గాని - నిశ్చయముగ గల్గు - నిత్యమౌ నరకంబు ||పశ్చాత్తా||

1.ఎంత పాపవైనను - జీవము క్రీస్తు - చెంత పార్థనఁ జేయుము = సంతోషమును మన - శ్శాంతిని నొసఁగున - నంతుఁడైన విమ-లాత్ముఁ డాదరించు ||పశ్చాత్తా||

2.జారచోరకార్యము - లేవైనను - బారఁదోలును వేగము = నారాజ్యమును వెదకు - నరు లందఱకు జీవ - ధార లెచ్చెదనని - కోరి కర్త వచించె ||పశ్చాత్తా||

3.వినుము ప్రభువు వాక్యము - జీవము నీవు - గనుము రక్షణ భాగ్యము = తనువు నిత్యముగాదు - నిను నీవె నమ్మకు - వినయ బుద్ధిని గ్రీస్తు - ఘనము వెదుకుము వేగ ||పశ్చాత్తా||

4.దిక్కుమాలిన దానవే - జీవము ప్రభుని - మ్రొక్కి పరమును జేరవే = నిక్కమిది నీ పాప - మెక్కువగా నున్న - మక్కువతో నిన్ను - గ్రక్కున విడిపించు ||పశ్చాత్తా||

5.బలములేని దానవే - జీవమ యాత్మ - బలము బొందుము వేగమే = యిలను విద్యాధన - బలముల నమ్మక - కలుష జాలము వీడి - కర కడకేగుము ||పశ్చాత్తా||

6.మందపోషకుఁడు క్రీస్తు - జీవమ యేసా - నందపూర్ణుఁడు థీరుఁడు = వందిత సత్సంఘ - మందుఁ జేరిన సత్యా - నందంబు నిత్యంబు - నొందుచు నుందువు ||పశ్చాత్తా||
- మోర్త ప్రకాశము 

Evarikosamo ee prana thyagamu ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము

 ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము (2)
 నీకోసమే నాకోసమే కలువరి పయనం
 ఈ కలువరి పయనం ||ఎవరికోసమో||

1.ఏ పాపము ఎరుగని నీకు - ఈ పాపలోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు - అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)
మోయలేని మ్రానుతో - మోముపైన ఉమ్ములతో -  నడువలేని నడకలతో
తడబడుతూ పోయావా - సోలి వాలి పోయావా

2.జీవకిరీటం మాకు ఇచ్చావు - ముళ్ళకిరీటం నీకు పెట్టాము
జీవ జలములు నాకు ఇచ్చావు - చేదు చిరకను నీకు ఇచ్చాము
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడు చుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో - ఒక్క పోటూ పొడిచితిమి
"తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు,వీరిని క్షమించు"
అని వేడుకొన్నావా.... పరమ తండ్రిని 

Nenante neekenduko ee prema నేనంటే నీకెందుకో ఈ ప్రేమా

నేనంటే నీకెందుకో ఈ ప్రేమా. - నన్ను మరచి పొవెందుకు (2)
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా - నన్ను విడిచిపోవెందుకు 
కష్టాలలో నష్టాలలో - వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలో కడగండ్లలో - వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు - ప్రాణమా.. నా ప్రాణమా (2) ||నేనంటే||

1.నిన్ను మరచిపోయినా - నన్ను మరచిపోలేవు -
నిన్ను వీడిపోయినా - నన్ను వీడిపోలేవు (2)
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
ఏ ఋణమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే||

2.ప్రార్ధించకపోయినా - పలకరిస్తు ఉంటావు -
మాట వినకపోయినా - కలవరిస్తు ఉంటావు (2)
ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)
ఏ బలమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే|| 
DOWNLOAD THIS SONG  HERE 👇

Yesu kreestunii golva యేసు క్రీస్తుని గొల్వ రన్న

297
యేసు క్రీస్తును కొలుచుట
రా - ముఖారి, తా - ఆది 

యేసు క్రీస్తుని గొల్వ రన్న - యీ జగతిలోన - నెవ్వరు లేరు వాని కన్న = యేసుని వాక్యము - ఎవ్వరి కబ్బునో - దోసము విడి పర - వాసము దొరకును ||యేసు||

1.సత్యుఁడు నిత్యుఁడాయ నన్న - యీ సర్వ సృష్టిఁ - జక్కఁగ సలిపి నిలిపె నన్న = వ్యత్యాసము లే - మియు లేకుండఁగ - సత్యుండు చేసెను - సర్వజగం బును||యేసు||

2.నిరాకారుఁడు నిశ్చయుఁడన్న - నరుల రక్షింప - నరావతారుఁడై నాఁడన్న = నరుల పాపములుఁ - పరిహరించుట - కొరకై మరియ కొడుకై పుట్టెను ||యేసు||

3.పరిశుద్ధవంతుఁ డాయ నన్న - ప్రభు యేసు నందఁ - పాపమే గానఁ బడుట సున్న = పరులను గావను - ధరలోఁ దిరిగెను - నరుల నడుమ బహు - నిరపరాధముతో ||యేసు||

4.భేదాభేదములు గాని బోధ - నాధుఁడొనరించె - సాధు లెల్లను సంతోషింప = బాధలుఁబడు స - ద్రిక్తులతోడను - సాదర వాక్కులు - జక్కగ పలికెను ||యేసు||

5.మహిలోన మనుజు లెవ్వ రైనఁ - జేయ లేనట్టి - మహిమాద్బుతములఁ జేసె నన్న = మహా రోగులను - మఱి మృతులను - మహా మహుండు స్వస్థుల - మఱి గావించెను ||యేసు||

6.వర్ణింప వలనుకాని వాఁడు - మన కోసర మతడు - మరణమై మరల బ్రతికినాడు = పరలోకమునకు - మరి వేంచేసిన - పరుఁ డగు క్రీస్తుని - పాదముఁ బట్టుము ||యేసు||

7.పరిశుద్ధ దూతల నాదముతో - ప్రభు యేసు క్రీస్తు - ప్రకాశ వస్త్ర మహిమలతోఁ = పరమునుండి బహు - త్వరగా వచ్చును -- ధరలో నమ్మిన - నరులను బ్రోచును ||యేసు||

8.న్యాయంబు దీర్చు దినము గలదు - నమ్మని వారెల్ల - సాయంబు వెదకినను గనపడదు = సువార్త న్యాయముఁ దీర్చును - నడవడి చొప్పున - నమ్మని పాపుల - నరకము జేర్చును ||యేసు||

9.నమ్మండీ నష్టము నొందక - యేసుని నమ్మిన - పొమ్మని చెప్పఁడు సుమ్మండి = ఇమ్ముగఁ గృపతో - నిలలోఁ గాచును - పిమ్మట మోక్ష పురమునఁ జేర్చును ||యేసు||
- గొల్లపల్లి నతానియేలు