Showing posts with label పురుషోత్తము చౌదరి. Show all posts
Showing posts with label పురుషోత్తము చౌదరి. Show all posts

16 February 2023

Naadu vachinatlu gaadu నాడు వచ్చినట్లు గాదు

228
క్రీస్తు యొక్క రెండవ రాకడ - అవిశ్వాసుల భయము 
(చాయ: హృదయమనెడు)
రా - ముఖారి, తా - ఆది 
 
నాడు వచ్చినట్లు గాదు - నేఁడు వచ్చుట = తేరి - చూడరాదు క్రీస్తు నింకఁ - జొత్తు మెచ్చుట ||నాఁడు||

1.మొదట గొఱ్ఱెపిల్ల రీతి - నొదిగి వచ్చెఁగా = యిపుడు - కొదమ సింహమయ్యె మనకు - గుండె దిగులుగా ||నాఁడు||

2.దాసునివలె దొల్లిఁ - జూచినాముగా = యిపుడు - దోసము లెంచి దండింప - దొరయైనాఁడుగా ||నాఁడు||

3.ఏ తట్టు బోయిన మనకు - నెదురు వచ్చెఁగా = పిడుగు - రీతి వాని యుగ్రమైన - దృష్టి హెచ్చఁగా ||నాఁడు||

4.కొండ వండ లందు డాగి - యుండలేముగా = వాని - యండనుండి మండు నగ్ని - యదిగో వచ్చెఁగా ||నాఁడు||

5.దిక్కుగా నున్నట్లు నితర - దేవతలను నమ్మి వట్టి = పుక్కిటి - పురాణములకుఁ బోయి చెడితిమి ||నాఁడు||

6.వీధుల బోధించు వారి వినక పోతిమి యిపుడు బాధఁ బొంది నరకాగ్నిలోఁ బడఁబాలైతిమి ||నాఁడు||
- పురుషోత్తము చౌదరి 

Ohoho maa yannalara ఓహోహో మా యన్నలారా

231
క్రీస్తు శరణు గోరుట 
(చాయ: నాడు వచ్చినట్లు గాదు) 
రా - ముఖారి, తా - ఆది 
 
ఓహోహో మా యన్నలారా - యుద్యోగింపండి = యిపుడే - ¹త్రాహి త్రాహి యనుచుఁ క్రీస్తుని - దయను గోరండి ||ఓహో||
 
1.అంత్యదినము నాటి బాధ - లాలకించండి = నరక - ప్రాంతమునకుఁ బోకమునుపే - ప్రభువును వేడండి ||ఓహో||
 
2.మింట ప్రభువు ²తేజోమయమౌ - మేఘారూఢుండై = యగ్ని - మంట వీను సింహాసనము - నంటి కూర్చుండు ||ఓహో||
 
3.అంధకారమగును సూర్యుఁడా దినమందు = ³కుముద - బాంధవుడు మిగుల రక్త - వర్ణము నొందును ||ఓహో||
 
4.కడు భీతిగ సర్వసృష్టి - కంపించుచు నుండున్ = భూమి ⁴కడలి ⁵యభ్రము తాపమున - కరిగి పోవుచుండున్ ||ఓహో||
 
5.నరక ప్రచండాగ్ని గుండ - మరదై గన్పడును = దానిఁ - జొరక మరి యే తెరువు పాపా - త్ములకు గలుగును ||ఓహో||
 
6.ప్రేమతో నడిగెదను నా - ప్రియబంధువులార = మీర - లామహా దినమందున దిరమై - యట నిలువంగలర ||ఓహో||
 
7.కామక్రోధ లోభమోహ - గర్వగుణములను = మీరు - ప్రేమించి చేసితిరి గద - పెక్కు విధములను ||ఓహో||
 
8.కల్లలాడుచుడి ప్రొద్దుఁ - గడుపుచుంటిరే = యింక - చిల్లర వేల్పుల పూజ - చేయుచుంటిరే ||ఓహో||
 
9.ప్రకటంబుగ నైన మరి ⁶గు - ప్తస్థల మందైన - చేయు - సకల క్రియలు ప్రభువున కెఱుక - సంపూర్ణముగాను ||ఓహో||
 
10.జాతి గోత్రమడుగఁ బోడు - సర్వేశ్వరుండు = క్రియల - రీతి మనసు మాత్రమె విచా - రించు ప్రభువతఁడు ||ఓహో||
- పురుషోత్తము చౌదరి
--------------------------------------
¹రక్షించుము. ²తేజోవికారము. ³చంద్రుడు. ⁴సముద్రము. ⁵ఆకాశము. ⁶రహస్యమైన.

20 May 2022

Vinarayya narulaara | వినరయ్య నరులారా

155 
క్రీస్తు వాక్యము పతిత పావనము
(ఛాయ: మన మొదట తల్లిదండ్రుల్)
రా – శంకరాభరణము,  తా – త్రిపుట

   వినరయ్య నరులారా - విశ్వాసమున క్రీస్తు - విమల బోధ = పాప మనుజుల కెల్ల పా - వన జీవనము సేయు - వసుధ మీఁద ||వినరయ్య||

1.పాపాత్ములను పశ్చా - త్తాపము పడుఁడంచు - బ్రభువు దెల్పెన్ = దన దాపు గోరినవారిఁ - గాపాడుటకుఁ దానే ¹దక్షుడయ్యెన్ ||వినరయ్య||

2.భారాక్రాంతులైన - పాపులఁ - దనుఁ జేరఁ - బ్రభువు పిల్చెన్ = శ్రమలు - దూరంబుఁ జేసిత - ద్దురితముల్ బాపి సం - తోష మియ్యన్ ||వినరయ్య||

3.అనుమానింపక నెవ్వ - రైన వచ్చినఁ ద్రోయ - ననుచుఁ బల్కెన్ = పెక్కు - మనుజుల కొఱకు జీ - వన మియ్యనే వచ్చి - తనుచుఁ దెల్పెన్ ||వినరయ్య||

4.మనసారదేవునిన్ - మానక ప్రేమింపు - మనుచునేర్పెన్ = ఇంకఁ దన పోల్కె - నొరులకు దాను బ్రేమింపగ దనర దెల్పెన్ ||వినరయ్య||

5.తన శిష్యులకు నైక్య - మును బ్రేమించుట కాజ్ఞ - లొనర నిచ్చె = నెంతో ఘన - సత్ప్రభువు కాళ్లు - గడిగి భక్తులచోట - వినతుఁ డయ్యెన్ ||వినరయ్య||
                        – పురుషోత్తము చౌదరి
--------------------------------------------
¹సమర్దు. 

Evaru bhagyavanthu laudu| ఎవరు భాగ్యవంతు లౌదు

154  
ధన్యతలు
రా – యదుకుల కాంభోజి,  తా – ఆదీ

ఎవరు భాగ్యవంతు లౌదు - ¹రవని లోపల = మోక్ష - ²వివరమైన క్రీస్తు బోధ - చెవులొగ్గి వినువారికన్న ||నెవరు||

1.³కవులు లాభ ⁴మరసి చేయు - కపట మంత్రముల్ = విధులు - ⁵దవులఁ బోవఁ దరిమి యేసు ⁶తత్వముఁగొనువారికన్న ||నెవరు||

2.దీనమానసుల కట్టి ⁷యుప - దేశ మిచ్చెను = దివ్య - మైన మోక్ష రాజ్యము వారి దౌనటంచు - ప్రభువు తెల్పె ||నెవరు||

3.⁸వృజినములకై దుఃఖించెడి - సుజను లెవ్వరో = వారు - నిజముగ నోదార్పుఁ బొంది నిత్య ⁹సంతోషింతు లని తెల్పె ||నెవరు||

4.శాంతి నీతికరుణల యందా - సక్తిగల వారు = భూస్వతంత్రులై పరి తృప్తినొంది - దయఁ బడసెద రని ప్రభువు తెల్పె ||నెవరు||

5.పరిశుద్ధ హృదయులు ¹⁰పరా - త్పరునఁ జూతురు = సర్వ - నరుల సమాధానపరచు - నరులె పరమ జనకుని సుతులు ||నెవరు||

6.నీతికొర కాపద నొందెడి - నిశ్చ లాత్ములు = వారు - ¹¹ఖ్యాతిగఁ బర లోక రాజ్య - ఘన సౌఖ్యము లెల్లను ¹²బడయుదురు ||ఎవరు||
                          – పురుషోత్తము చౌదరి
--------------------------------------------------
¹భూమిపైన. ²స్పష్టమై. ³కవిత్వము చెప్పువారు. ⁴విచారించి పాపములకై. ⁵దూరముగ. ⁶వాస్తవము. ⁷బోధ. ⁸పాపములకై. ⁹సంతోషింపచేయబడువారు. ¹⁰దేవుని. '¹¹ప్రసిద్ధిగా. " ¹²పొందుదురు.

14 May 2022

Andamaina kreesthu kadha | అందమైన క్రీస్తు కథ

151  
పుట్టిగ్రుడ్డికి చూపునిచ్చుట
రా - నవరోజు,    తా - త్రిపుట

     అందమైన క్రీస్తు కథ మీ - రాలింపరయ్య ||అందమైన||

1.పొందుగ శిష్యులతో యేసు - పోవుచుండు మార్గమందు - ముందుగ ¹వీక్షించి రొక్క పు ²ట్టంధకుని = అందుఁ గొందఱు శిష్యు - లాత్మలో భావించి - రెందు కీతఁడు ³చీక - య్యెను దీని విధమేమో - డెందములనుఁ గల్గు - సందియములు వీడ - విందమనుచు లోక - ⁴వంద్యుని సంతతా = నందుని మనుజ - ⁵నందనుని నడిగిరప్పు ||డందమైన||


2.చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు - లేక వీని ⁶జననీ జనకు - లేమి చేసిరో = యీ కారణముఁ దెల్పు - మోకర్త యిపుడీవు - మాకంచు తను వేఁడ - లోకేశ్వరుండు ని - రాకారుఁ డితనియం - దీకార్యములుఁ జూపఁ - బ్రాకటముగఁ జేసెఁ - గాక వేరొకవిధము = లేకున్నదని తెల్పి - చీకుఁ బ్రోవఁ దలంచె ||నందమైన||


3.బురద వాని కన్నులందుఁ - ⁷గరములతోఁ ⁸జమిరియొక్క చెఱవులో ⁹బ్రాక్షాళించుటకు - సెలవిచ్చెఁ బ్రభువు = బిరబిర నయ్యంధుఁ - డరిగి యేసుని పల్కుఁ - దిరముగ మదినమ్మి - ¹⁰సరసిలో మునిఁగి సుం - దరమైన నేత్రముల్ - ధరియించి యానంద - భరితుడై చనుదెంచు - ¹¹తఱివాని పొరుగింటి = నరులబ్బురముగఁ జూ - చిరి మార్మోమగువాని ||నందమైన||


4.చూపులేని గ్రుడ్డివానిఁ - జూడఁ గలుగఁజేయువాఁడే - పాపాంధకార ¹²మగ్నుల నా - ప్రభువే రక్షించు - పైపైని మనకన్ను - చూపు చూపది గాదు - లోపలి కనుగుడ్డి - యైపోయి యున్నది - యాప ¹³త్పరంపర - లోఁ బొరలుచున్నాము - కాపాడుమని యేసు - శ్రీ పాదములుఁ బట్టి = చూపు లోపలి చూపుఁ - జూచి యానందింత ||మందమైన||
                     – పురుషోత్తము చౌదరి
---------------------------------------------
¹చూచిరి. ²గుడ్డివాని. ³గుడ్డి. ⁴స్తోత్రింపబడిన. ⁵కుమారుని. ⁶తలిదండ్రులు. ⁷చేతులతో. ⁸వ్రాసి. ⁹కడుగుకొనుటకు. ¹⁰చెఱవులో. ¹¹సమయమున. ¹²ముణిగిన. ¹³సమూహము.

23 April 2022

Idhigo naa shishuyulara | ఇదిగో నా శిష్యులారా యెఱుక

224  
క్రీస్తు కడపటి హెచ్చరిక
రా - ముఖారి,  తా - ఆది

ఇదిగో నా శిష్యులారా - యెఱుక లుంచుఁడి = మోక్ష -  ¹సదనమున కేను బోదు - సంతోషించు(డి ||ఇదిగో||

1.యెరూషలేమందుండి మీ - రెదురు చూడుఁడి -  మీపైఁ - బరిశుద్ధాత్మయు దిగివచ్చి - పనులు దెల్పును ||ఇదిగో||

2.దిక్కులేనట్లు మిమ్ము - దిగనాడి పోను = మీతో - మక్కువైయుండఁ బరిశు - ద్ధాత్మను బంపెదను ||ఇదిగో||

3.నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు = నాతో - సర్వకాలము నిత్య - సామ్రాజ్యము నేల ||నిదిగో||

4.ఒకరితో నొకరు ప్రియము - లొప్పి యుండుఁడి =  నాదు సకలాజ్ఞలందు నిదియె - సార మనుకొనుఁడి ||యిదిగో||

5.ఏదైననా పేరిటమీ - రించుక వేఁడినను = మీకు - మోదముతోడదాని - ముందే చేయుదును ||ఇదిగో||

6.ఉల్లము లందుఁ గలఁత - లెల్ల విడువుఁడి = నేను -  మళ్లి వచ్చెడి విధము - మరువకుండుఁడి ||యిదిగో||
                 – పురుషోత్తము చౌదరి

21 April 2022

Sudathulara mee richhota | సుదతులార మీ రిచ్చోట

215 
క్రీస్తు పునరుత్థానము
రా - మధ్యమావతి, తా - త్రిపుట

సుదతులార మీ - రిచ్చోట నెవ్వరి -  వెదుకుచు నున్నారు = మృదువుగాను - జీ - వించు వాని పెద్ద - నిదుర బోయినటు - లెదలందు భావించి ||సుదతులార||

1.ఇచట లేఁడు లేచి - యున్నాఁడు ప్రభు క్రీస్తు - యేసు స్వతంత్రుఁడై = ప్రచురంబుగఁ దన - పాట్లు లేచుటయును - వచియించె గలిలయ్య - వర దేశమున మీతో ||సుదతులార||

2.మనుజ కుమారుఁ డె - క్కుడు పాపిష్ఠులచేత - మరణ మొందుట సిల్వ పైఁ = దనకుఁ దానె మూఁడవ -  దినమందు లేచుట - యును దెల్పెఁ గద మీరు - వినుచుండఁగఁ దొల్లి ||సుదతులార||

3.ఎదలలోన జ్ఞాప - కము చేసికొనుఁడింక - యేసు తెల్పిన మాటలు = ముదముతో జీవముఁ - గని లేచె నను వార్త - సుదతు లాలకించి - రది నిక్కముగఁ దోఁచఁ ||సుదతులార||
               – పురుషోత్తము చౌదరి

02 March 2022

Apu darchakadhu luppongiri | అపు డర్చకాదు లుప్పొంగిరి

185
సిలువ
(ఛాయ: వచ్చి గాబ్రియేలు)
రా - ఆనందభైరవి, తా - త్రిపుట

అపు డర్చకాదు లుప్పొంగిరి - ప్రభుని - విపరీతముగఁ జంపసాగిరి = కృపమాలినట్టి పా - పపు జిత్తమున నిష్ఠు - రపు సిల్వమానిపైఁ - బ్రభుని వేయుట కొప్పి ||రపు డర్చ||

1.యెరూషలేమను నూరి బైటను - దుఃఖ - కరమైన కల్వరిమెట్టను = పరమ సాధుని సిల్వ - పైఁ బెట్టి తత్పాద - కరమధ్యముల మేకు - లరుదుగ దిగఁ గొట్టి ||రపు డర్చ||

2.చిమ్మె నిమ్మగు మేని రక్తము దాని - నమ్ము వారల కెంతో యుక్తము = నెమ్మోము వాడి కెం - దమ్మి పూవలె మస్త - కమ్ము వేటులను ర - క్తము జారి కనుపట్టె ||నపు డర్చ||

3.గడి దొంగ లిరువురుని బట్టిరి - ప్రభుని - కుడి యెడమలను సిల్వఁ గొట్టిరి = చెడుగు యూదులు బెట్టు - కడు బాధలను మరియ - కొడు కోర్చుకొని వారి - యెడ దయ విడఁడయ్యె ||నపు డర్చ||
                   - పురుషోత్తమ చౌదరి

10 February 2022

Mangalame yesunaku | మంగళమే యేసునకు

073
క్రీస్తునకు స్తోత్రము
రా - తోడి, తా - ఆది
 
మంగళమే యేసునకు - మనుజావ తారునకు = శృంగార ప్రభువునకు - క్షేమాధిపతికి ||మంగళ||
 
1.పరమ పవిత్రునకు - వరదివ్య తేజునకు = నిరుపమా నందునకు - నిపుణ వైద్యునకు||మంగళ||
 
2.దురిత సంహారునకు - వర సుగుణో దారునకు = కరుణా సంపన్నునకు - జ్ఞానదీప్తునకు ||మంగళ||
 
3.సత్య ప్రవర్తునకు - సద్ధర్మ శీలునకు = నిత్య స్వయంజీవునకు - నిర్మలాత్మునకు ||మంగళ||
 
4.యుక్త స్తోత్రార్హునకు - భక్త రక్షా మణికి = సత్య పరంజ్యోతియగు - సార్వభౌమునకు||మంగళ||
 
5.నర ఘోర కలుషముల - నురుమారంగ నిల = కరుదెంచిన మాపాలి - నర రక్షకునకు ||మంగళ||
 
6.పరమపురి వాసునకు - నర దైవ రూపునకు = పరమేశ్వర తనయునకు - బ్రణుతింతుము నిన్ను ||మంగళ||
- పురుషోత్తము చౌదరి
DOWNLOAD MP3 SONG HERE 👇

23 December 2021

Parishudhi Parishudhi | పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని

504
పరిశుద్ధుల ప్రకాశత
రా -మారువ (చాయ:నీ కన్న యిక వేరె) తా - త్రిపుట

పరిశుద్ధి పరిశుద్ధి - పరిశుద్ధి యని వినఁ - బడు పుర మదిగో పద పదరే ప్రియులారా = పరమేశ్వరుని చేతఁ - బరిపాలనముఁ గల్గి - చిరమై - భాసురమై - సు - స్థిరమై సుందరమైన ||పరిశుద్ధి||

1. ¹రవితోను ²కుముదబాం - ధవుతోను మఱి దీప - ³చ్ఛవితోను దాని కవ - సర మింతలేదు =  ⁴అవిరతమునఁ గ్రీస్తుఁ - డందుండుఁ ⁵ప్రభతో  ⁶సం - స్తవమై ⁷వైభవమై యు - త్సవమై వెల్గుచు నుండుఁ ||పరిశుద్ధి||

2. గొదయైన మఱియే యా - పదయైన దగయైన - మొదలే లేకుండు న ప్పుర వాసు లందు = మృదు జీవోదకము ల - ర్మిలి నిరంతర మిచ్చు - గుదురుగ నెదురుగఁ - గూర్చుండి యువరాజు ||పరిశుద్ధి||

3. ప్రభు కృపాసనములో పలినుండి ప్రవహించి - శుభమైన నది యుండి సుఖమిచ్చు నచట = సుభయ తీరములందు - నుండు వృక్షములు సౌ - రభదీప్త శుభములై - రక్షా ఫలము లిచ్చు ||పరిశుద్ధి||

4. జననంబు మరణంబు - సంసార సుఖబాధ - లనుభవించుట గల్గ - దా పురమునందు = మును నీతి కొఱ కాప - దను బొందు తనవారి - కనునీ ళ్లన్నియు దుడుచు - మన దేవుఁ డందుండి ||పరిశుద్ధి||

5. వెలకంద రాని ని - శ్చలమైన ఘన జీవ -  విలపత్కిరీటము - ల్గల వప్పుర - మునఁ = బిలిచి నప్పుడే విభుని - పెండ్లి విందున కేగు - కుల బంధువులకు ని - చ్ఛల నిచ్చు దేవుఁడు ||పరిశుద్ధి||
– పురుషోత్తము చౌదరి
________________________________
¹సూర్యుడు. ²చంద్రుఁడు. ³శాంతి. ⁴శాశ్వతముగా. ⁵శాంతి ⁶స్తోత్రములతో నిండినది. ⁷భాగ్యముగలది. ⁸ప్రకాశమానమైన.
DOWNLOAD MP3 SONG HERE 👇

15 October 2021

Popove Yo Lokama | పోపోవే యో లోకమా

484
లోక విసర్జనము 
రా– బిళహరి,తా -త్రిపుట
(చాయ: ఎందుకు మరచితివి)

పోపోవే యో లోకమా - చాలిఁకఁజాలు - నీ పొందు మే మొల్లము - పాపేచ్ఛలున్నంత - సేపు నొపఁగ రాని - వేపాట్లు బెట్టితి - వీపట్ల నను వీడి ||పోపోవే||

1. సకలేంద్రియ వ్యాప్తులు - నీ సేవ బా - యక చేయు దివసంబులు = ఇం క దీరి పోయె భ్రా - మికము జూపకు మిపుడు - ప్రకటమ్ముగఁ గ్రీస్తు - పద - భక్తి మా కబ్బెఁ ॥బోపోవే ॥ 

2. నీ రాజు బహుమానము - గంటిమి ఘోర - నరకాంబుధి తీరము = దారి దొలఁగి నిన్ను - జేరి దుఁఖముల వే - సారి తిప్పుడు క్రీస్తు - సదయుఁడై ననుఁబిల్చెఁ ॥బోపోవే ॥

3. ఎఱ జూపి బలు మీనము - బట్టెడు వాని - కరణి వస్తుల రూపము = బొరి జూపి లోభము - బుట్టించి ననుఁబట్టి - పరిమార్చితివి యింక - యేమున్నది చాలుఁ ॥ బోపోవే ॥ మరి 

4. ఎండమావుల తేటలు - నీ విచ్చెడు - దండైన యిహ సుఖములు - కండ గర్వముచే నీ - యండఁ జేరితిఁగాని - నిండు నెమ్మది దయా - నిధి క్రీస్తు డిపు డిచ్చుఁ ॥బోపోవే ॥
- పురుషోత్తము చౌదరి
DOWNLOAD MP3 SONG HERE 👇

20 August 2021

Rare Mana Yesu Swamini | రారే మన యేసు స్వామిని

83
క్రీస్తును చూడ రండి
రా – శంకరాభరణము, తా – ఆది
                          
రారే మన యేసు స్వామిని - జూతము కోర్కె - ¹లూర ప్రియు లారా ²పేర్మిని = ³గూరిమి భక్తులఁ - ⁴విందట భూరిద ⁵యామృత - సారము లొలికెడు - ¹చారు కటాక్ష ²వి - శాలేక్షణుఁడఁట - ³నారకులగు ⁴నర - నారీజనులకు - ⁵దారక మొసఁగను - దానె పిలుచునఁట - ⁶దారుణ పాప మ హారణ్యమునకుఁ - ⁷గారుచిచ్చు గతి - గన్పడువాఁడట - ఘోర దరిద్రతఁ - గూల్చెడివాఁడట = సారం బగు తన - సభకు ⁸మకుటమఁ ట ||రారే||

1. ⁹పతిత పావనమౌ వేల్పఁట - అనాది దేవ - సుతుడై యిలఁ జేరి నాఁడఁట = ¹⁰సతతము కడు ¹¹దురి - ప్రతి దేశమునకు ¹²హితభాస్కరుఁడఁట - ¹³అతులిత ¹⁴మోక్షో - న్నత గుణగణుఁడఁట ¹⁵కుతలంబున ¹⁶న - ఛతి రహితంబగు పతితులఁ గావను - మృతుడైనాఁ డఁట - అతిపుణ్య ¹⁷తను - క్షత శోణితమును - ¹⁸వ్రతముగ సిలువను - నతడొసంగెనఁట - మృతిని జయించుచు - బ్రతికి లేచెనంట మతి నమ్మిన మన - గతి యితఁడేనఁట || రారే||

2.తుదలేని మహిమవాఁడఁట - తనుఁగొల్చు సాధు - హృదయుల సొమ్ము మూటఁట = చెదరిన గొఱ్ఱెల - ¹⁹వెదకవచ్చెనంట - చిదురు పలగు - జన హృదయము లన్నిటఁ - బదిలముగా నె - మ్మది నిడువాఁడఁట - ²⁰నదితట ²¹మఠ ²²జన - వదనముల ²³స - మ్మద శుభవార్తనుఁ - బలికిన వాఁడఁట - సదయత ²⁴నంధుల - ²⁵కక్షుల ²⁶నిడెనఁట - వెదకి ²⁷బధిరులకు - ²⁸వీను లొసఁగె నంట - ²⁹సదమల ³⁰మోక్ష - ప్రదుఁడగు విభుఁడఁట = యిదిగో మనకిత - డేలినవాఁడఁట || రారే ||
- పురుషోత్తము చౌదరి
______________________________
¹వృద్ధిపొందినట్లు.  ²ప్రేమచేత.  ³ప్రేమచేత ⁴బంధువుఁడు. ⁵అమృతము యొక్క రసము. ¹సుందరమైన. ²పెద్దనేత్రములుగలవాఁడు. ³నరకసంబంధులు. ⁴పురుషుల స్త్రీలునగు. ⁵ఆధారము. ⁶భయంకరమైన. ⁷అడవినిప్పు. ⁸కిరీటము. ⁹పాపులను పవిత్రముచేయు.¹⁰నిత్యము. ¹¹పాపమనెడు చీకటితో గూడుకొనిన. ¹²అనుకూలమైన సూర్యుడు.¹³సమానములేని. ¹⁴మోక్షమకంటె ఉన్నతమైనగుణ సమూహము గలవాఁడు. ¹⁵భూమియందు. ¹⁶సడతిలేని. ¹⁷శరీరముయొక్క గాయపు రక్తమును. ¹⁸పట్టుదలగా. ¹⁹ముక్కలు. ²⁰నదీతీరములయందు. ²¹గుళ్లలో.  ²²గ్రామములలో. ²³సంతోషముతో. ²⁴గ్రుడ్డివారికి. ²⁵కన్నులు. ²⁶ఇచ్చెను. ²⁷చెవిటివారికి ²⁸చెవుడు ²⁹పరిశుద్ధమైన. ³⁰మోక్షమిచ్చువాఁడు.

Vandanamayya Yesu Neeku | వందనమయ్యా యేసు నీకు

89
యేసునకు వందనము
రా–శంకరాభరణము (చాయ:ఉదయించినాడు) తా-అట

వందనమయ్యా - యేసు నీకు - వందనమయ్యా - మా కోరిక - లందియ్య వయ్యా = వందనమయ్య నీసుందర పాదార - విందములకు భక్తి - వినతులు గావించు = సందియంబులులేని పరమానందమున నీయందు డెందము - పొందుపడఁ జేయవె యెహోవా - నందనా ¹పాపేంధనాగ్ని ||వందనమయ్యా||

1.నర దైవత్వములు  రెండుగూడి - పరి పూర్ణమైన - దేహాత్మలు - ధరియించి యందు - లేశంబయిన - దురితంబులేని - యవతారము - నెరవుగా దాల్చిి = ధరణికి నేతెంచి ²నిరయారులగు సర్వ - నరుల రక్షింప నీ కరుణా ప్రవాహముు = విరివిగా పరుగెత్తఁ జేయుచు - విమలమగు నీ ప్రాణరక్తము - లరుదుగా సమర్పణము చేసియు - తిరిగి లేచితివో మహా ప్రభూ || వందనమయ్యా ||

2.పుణ్యమందు - నమ్ముకొనెడి - యే పాపియైన - తక్షణమున - శాపంబుఁ బాసి - ³త్రాణగలిగి - నీ ⁴సజ్జనుండు - కృపవానిని - కాపాడుచుండు = దీపించు భవ దీయ దివ్య వాగ్దత్తంబు - లాపత్పరంపరల కడ్డుపడుచు నుండి = నీ పయిందన భారమెల్లనుు -  మోపి యోపికనుండ నేర్చిన - పాపి పుణ్యండగుచు నాత్మను - ⁵భవ్య సుఖ ⁶మఖిలంబుఁ బడయును || వందనమయ్యా||

3.శమదమ ప్రేమ - కృపా వినయ - సద్గుణము లనెడి - భూషణముల - నిమిడి యున్నట్టి - తనువు దాల్చి - క్రమముగానందు - దైవత్వము - కనుపఱచినావు = విమలోపదేశముల్  వివిధంబుగా శిష్య - సముదయమునకు నుత్తముగా బోధించి - యమిత పాపహరంబునకు భువినవతరించిన మేను సిలువను - శ్రమను మృతికల్పించి మృత్యువుఁ - జంపి జీవించిన మహాత్మా ||వందనమయ్యా||
- పురుషోత్తము చౌదరి
____________________________
¹కట్టెలకు నిప్పువంటివాడా. ²నరపాత్రులు. ³బలము. ⁴సమీపము. ⁵శుభమైన . ⁶సకల.

14 August 2021

Paralokamuna nundu deva | పరలోకమున నుండు దేవ

25
రక్షణ కొరకు కృతజ్ఞత
రా – జంఝూటి,  తా – ఏక

పరలోకమున నుండు దేవ - నీ పదముల కొనరింతు సేవ = దురితంబులకు నేను -  వెఱచి యున్నానని - కరుణించి నీ సుతుని - ధర కంపితివి గాదా = అరయఁగా నీ ప్రేమ యింతన - దరము గాదో పరమ జనక - మరణ పర్యంతంబు నిను నే - మరువఁ జాలను - వరకృపా నిధి || పరలోక||

1.యేసుక్రీస్తుని దయసేయ కున్న - మోస మొందెద నెందుకన్న - దోసంబులకు నేను - దాసుండనై ప్రతి - వాసరంబును నీదు - భాసు రాణాలు విడిచి = వేసటలు గల నరకమునఁ బడ -  ద్రోసిన నది న్యాయమౌ గద - నా సునాధా పేర్మిచేతను - నీ సుతుని నంపించినావు ||పరలోక||

2.ఎన్నరాని మహిమ నుండి - యేసు - నన్నుఁ బాలింప నేతెంచి = యెన్న శక్యము గాక - యున్న పాపము లన్ని - ఛిన్నాభిన్నము జేసి = నన్ను సమ్మతిపరప - నన్న యగు నా రక్షకుండు - తన్ను తానర్పించి వెండియు - నున్నతుండై లేచి యిప్పుడు - సన్నిధానం బొసఁగె నాకుఁ ||బరలోక||
                         – పురుషోత్తము చౌదరి

23 August 2020

Mangalamu Badare | మంగళము బాడరె

72                క్రీస్తునకు మంగళార్చన 
                 (చాయ: గీతములు పాడరె ) 
రా - బిలహరి                                 తా - త్రిపుట

మంగళముఁ బాడరె – క్రీస్తుకు జయ – మంగళముఁ బాడరె – యో ప్రియులారా – మంగళముఁ బాడరె = మంగళముఁ బాడి దు – స్పంగతిని వీడి ప్రభు - ¹సంగులను గూడి మదిఁ - బొంగుచుఁ ²జెలంగుచును || మంగళము||

1. రాజులకు రాజని – దూతలచేత పూజఁగొనువాఁడని – తేజమున సూర్యునికి – దీప్తి నిడు సద్గుణ వి – ³రాజితుని సాధుజన – రక్షకుని పక్షముగ || మంగళము ||

2. కరుణ గల వాఁడని – పాపులఁ బ్రోచు – బిరుదుఁగొనినాఁడని = మరణమును దానిఁ ⁴బరి – మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁడె మన పాలి వాఁడని శుభ || మంగళము ||

3. సంగీతము పాడుచు – సువార్త ప్ర – సంగములఁ గూడుచు = ⁵నింగికిని భూమికిని – నిత్యముగ నేలఁ దగు - శృంగారపు రాజునకు – క్షేమ మగు ఆమేనని || మంగళము ||
                                       - పురుషోత్తము చౌదరి
_____________________________________
¹ప్రభువుతో నున్నవారిని. ²సంతోషించుచు. ³ప్రకాశించువానిని. ⁴నశింపజేయు. ⁵ఆకాశము

11 July 2020

Unna paatuna vachu | ఉన్న పాటున వచ్చు

315
ఉన్న విధముననే నీ యొద్దకు వచ్చుచున్నాను
రా - ముఖారీ, తా - త్రిపుట

ఉన్న పాటున వచ్చు - చున్నాను నీ పాద - సన్నిధి కో రక్షకా = యెన్న శక్యము గాని పాపము - లన్ని మోపుగ వీపు పైబడి - యున్న విదె నడలేక తొట్రిలు - చున్న వాడను నన్ను దయ గను ||యున్న||

1.కారుణ్య నిధి యేసు - నారక్షకా నీ శ - రీర రక్తము చిందుట = భూరి దయతో నన్ను నీదరి - జేర రమ్మని పిలుచుటయు ని - ష్కారణపు నీ ప్రేమ యిది మరి - వేరే హేతువు లేదు - నాయెడ ||యున్న||
 
2.మసి బొగ్గువలె నా మా - నస మెల్ల గప్పెదో - ష సమూహములు మచ్చలై = ¹అసితమగు ప్రతిడాగు తుడువను - ²గసటు గడిగి పవిత్ర పరపను - ³నసువు ⁴లిడు నీరక్తమే యని - ⁵మసల కిప్పుడు సిలువ నిదె గని ||యున్న||

3.వెలపట బహు యుద్ద - ములు లోపటను భయము - కలిగే నెమది దొల గెను = పలు విధము లగు ⁶సందియంబుల - వలన బోరాటములచే నే - న లసి యిటునటు గొట్టబడి దు - ర్బలుడనై గాయములతో నిదె ||యున్న||

4.⁷కడు బీదవాడ ⁸నం - ధుడను దౌర్భాగ్యుడను - జెడిపోయి పడి యున్నాను = ⁹సుడివడిన నా మదికి స్వస్థత - జెడిన కనులకు దృష్టి భాగ్యము - బడయవలసిన వన్ని నీ చే - ¹⁰బడయుటకు నా ¹¹యొడ యుడా యిదె ||యున్న||

5.నీ వాగ్దత్తము నమ్మి - నీపై భారము పెట్టి - జీవ మార్గము గంటిని = ¹²కేవలంబగు ప్రేమచేతను - నీవు నన్ను క్షమించి చేకొని - ¹³భావశుద్ధి ¹⁴నొనర్చి సంతోషావసరముల నిడుదువని యిదె ||ఉన్న||

6.దరిలేని యానంద - కరమైన నీప్రేమ - ¹⁵తరమే ¹⁶వర్ణన చేయను = ¹⁷తెరవు కడ్డంబైన యన్నిటి- విఱుగ గొట్టెను ¹⁸గాన నే నిపు ¹⁹డరుదుగా నీ వాడ నవుటకు - మఱి నిజము నీవాడ నవుటకే  ||యున్న||
                           - పురుషోత్తము చౌదరి
_________________________________
¹నల్లవి. ²మైల. ³ప్రాణములు. ⁴ఇచ్చుట. ⁵ఆలస్యము చేయక. ⁶సందేహములు. ⁷మిక్కిలి. ⁸గ్రుడ్డివాడను. ⁹సొమ్మసిల్లిన. ¹⁰పొందుట.  ¹¹కర్త. ¹²ముఖ్యమైన. ¹³మనస్సు శుచిగా. ¹⁴చేసి. ¹⁵శక్యమా. ¹⁶స్తుతి. ¹⁷మార్గము. ¹⁸కనుక. ¹⁹ప్రియముగా.
DOWNLOAD MP3 SONG HERE 👇

03 July 2020

Yerigi yerigi chedipothivi | ఎఱిగి యెఱిగి చెడిపోతివి

319
ఆత్మ వంచన
రా - ధన్యాసి, తా - ఆది

ఎఱిగి యెఱిగి చెడిపోతివి మనసా - యిక నీ దిక్కెవ్వరు చెపుమా = దురితం బిదిసచ్చరితం బిది యని - యెరుక సరకు గొన - కేమియు నీ ||యెఱిగి||

1.ఇది దేవుని దయ యిది క్రీస్తుని ప్రియ - మిది విమలాత్ముని గుణ మనుచు = ఎదలో ననుభవ మెఱిగి మరల దు - ర్మదమున దుష్కృత పదమున బడితివి ||యెఱిగి||

2.సకలము జూచెడు దేవుని కంటికి - జాటుగ జరిగెడి పని యేది = ఇక జెవి గుసగుస లెల్లను దిక్కుల బ్రకటము జేసెడు - ప్రభు వున్నాడని ||యెఱిగి||

3.ఎన్నిమార్లు సిలువను వేయుచు ప్రభు - యేసుని వెతబడ జేసెదవు = తిన్నని మార్గము - తెలిసియుండు నీ - కన్నుల గంతలు - గట్టితి వయ్యో ||యెఱిగి||

4.గద్దించెడు మనస్సాక్షికి గడ - గడ లాడక పోతివి నీవు = హద్దు మీరి దై వాజ్ఞలు ద్రోయుచు - నెద్దులాగు పరు - గెత్తితి వయ్యో ||యెఱిగి||

5.పలువిధ శోధన బాధలలో ఘన - ప్రభు క్రీస్తుడె నీ దిక్కనుకో = తాళుచు బశ్చాత్తాపముపడి యిక - జాలించుము కలు - షపు యత్నంబు ||యెఱిగి||

6.అపరిమిత దయా శాంతులు గల ప్రభు - వనిశము కోపింపడు నీపై = కృపా వాగ్దత్తము - లెపుడు దలచి నీ - యప విత్రత గని - హా యని యేడ్వుము ||యెఱిగి||
    - పురుషోత్తము చౌదరి
DOWNLOAD MP3 SONG HERE 👇

02 June 2020

Nee charanamule nammithi | నీ చరణములే నమ్మితి

393
క్రీస్తుని ఆశ్రయించుట
రా - శహన,  తా - కరుజంపె

  నీ చరణములే నమ్మితి నమ్మితి - నీ పాదములే పట్టితి బట్టితి బట్టితి ||నీచరణములే||

1.దిక్కిక నీవే చక్కగ రావే = మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీచరణములే||

2.ఐహిక సుఖము - నరసితి నిత్యము = అహాహా ద్రోహిని ద్రోహిని ద్రొహిని ||నీచరణములే||

3.న్యాయము గాని - నాక్రియలన్ని - రోయుచు ద్రోయకు త్రోయకు త్రొయకు ||నీచరణములే||

4.భావము మార్చి నా వెత దీర్చి = దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీచరణములే||

5.చంచల బుద్ది - వంచన యెద్ది - ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీచరణములే||

6.చుట్టుకొని యున్న - శోధన లున్నఁ = పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీచరణములే||

7.నాచు పిశాచి - నరకుట గాచి = కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే||

8.యేసుని తోడ - నెవ్వరు సాటి = దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే||
- పురుషోత్తము చౌదరి
_________________________________
Nee charanamule nammithi nammithi - Nee paadamue pattithi battithi battithi

1.Dikkika neeve chakkaga raave = mikkili mrokkudu mrokkudu mrokkudu ||nee chara||

2.Ihika sukhamu narasiti nithyamu = ahaha dhrohini dhrohini dhrohini ||nee chara||

3.Nyamua gaani naa kriyalanni =  royuchu dhroyaku throyaku throyaku ||nee chara||

4.Bhavamu maarchi naa vetha dheerchi = Devara provave provave provave ||nee chara||

5.Chanchala bhuddhi vanchana yeddhi = Unchaka thrunchave thrunchave thrunchave ||nee chara||

6.Chuttukoni yunna shodhana lunna = Pattuvida gottave kottave kottave ||neechara||

7.Naachu pichaasi - narakuta gaachi = Kaachuko daachave daachave daachave ||nee chara||

8.Yesuni thoda nevvaru saati = Dosamu baapunu baapunu baapunu ||nee chara||
 - Purushothamu choudari
DOWNLOAD MP3 SONG HERE 👇

01 June 2020

Yehova naa mora | యెహోవ నా మొఱ

16
యెహోవా ప్రేమ 
(23 వ దావీదు కీర్తన) 
రా - శంకరాభరణము,  తా - ఆది
యెహోవా నా మొఱ లాలించెను - దన - మహా దయను నను ¹గణించెను = ²అహర్నిశల దీనహీనుఁడగు నా - దు ³హాయనెడు ధ్వని - గ్రహించి ⁴మనిపెను || యెహోవా||

1.⁵పిశాచి గడిమిఁబడఁగొట్టెను - దన - వశాన నను నిలువఁ బెట్టెను = ⁶ప్రశాంత మధుర సు - విశేష ⁷వాక్ఫల - ⁸నిశాంతమునఁ జే - ర్చి ⁹సేదఁ దీర్చెను || యెహోవా||

2.¹⁰మదావళముఁ బోలు నామదిన్ - దన - ¹¹ప్రదీప్త వా ¹²క్యాం కూశా హతిన్ = యధేచ్చలన్నిటి గురించి పాపపు - మొదల్ తుదల్ నరి - కి దరికిఁ జేర్చెను || యెహోవా||

3.అనీతి వస్త్ర ¹³మెడలించెను - యే - సునాధు రక్తమున ముంచెను ¹⁴వినూత్న యత్నమె - ద నూని యెన్నఁడు - గనన్ వినన్ బ్రే - మ నాకుఁ జూపెను || యెహోవా||

4.విలాపములకుఁ జెవి నిచ్చెను - శ్రమ - కలాపములకు సెలవిచ్చెను శిలానగము పై - కిలాగి నను సుఖ - కళావళుల్ మన - సులోన నిలిపెను || యెహోవా||

5.అగణ్య పాపియని త్రోయక - న - న్ను గూర్చి తన సుతుని దాఁ చక = తెగించి మృతి కొ - ప్పగించి పాపపు - నెగుల్ దిగుల్ సొగ - సుగా నణంచెను ||యెహోవా||
- పురుషోత్తము చౌదరి
_____________________________
¹సంపాదించెను.²రాత్రియందు పగటియందు. ³దుఃఖము చేతగలిగిన. ⁴రక్షించెను. ⁵శక్తి. ⁶మిగుల నెమదిగల. ⁷వాక్కు యొక్క ఫలమైన. ⁸గృహమున ⁹అలత. ¹⁰మదించినయేనుగు.¹¹ప్రకాశమైన.¹² అంకుళపు దెబ్బ చేత. ¹³పోగొట్టెను. ¹⁴క్రొత్త.
------------------------------------------
Yehova na mora laalinchenu - Dana - maha dayanu Nanu ganinchenu = Aharnishala deena hinudagu na - du hayanedu - dhvani grahinchi manipenu ||Yehova||

1.Pishaachi gadimi badagottenu Dana - vashana nanu niluva bettenu = Prashantha madura su - vishesa vakphala Nishanthamuna je - rchi seda deerchenu ||Yehova||

2.Madavalamu bolu naamadin - Dana - pradeeptha vaakyam kusha hathin = Yedhechalanniti gurinchi papapu - Modhal tudhal nari - ki dariki jerchenu ||Yehova||

3.Aneethi vastra medalinchenu - Ye - sunaadhu rakthamuna munchenu = Vinuthna yethna me - da nooni yennadu - Ganan vinan bre - ma naaku jupenu ||Yehova||

4.Vilaapamulaku jevi nichenu - Shrama - kalaapamulaku selavichenu = Silanagamu paiki laagi nanu sukha - Kalaavalul mana - sulona nilipenu ||Yehova||

5.Aghanya paapiyani throyaka - Na - nnu goorchi thana suthuni da chaka = Theginchi mruthi ko - ppaginchi paapapu - Negul digul soga - suga nananchen ||Yehova||
    - Purushothamu choudari
DOWNLOAD MP3 SONG HERE 👇

30 May 2020

Nannu gannayya raave | నన్ను గన్నయ్య రావె

377
క్రీస్తునందలి అభయము
రా - హుసేని,    తా - అట

    నన్ను గన్నయ్య రావె నా యేసు = నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||

1.ముందు నీ పాదారవిందము - లందు నిశ్చల భక్తి ప్రేమను = పొందికగా జేయ రావే నా - డెంద మానంద మనంత మై యుప్పొంగ ||నన్ను|| 

2.హద్దులేనట్టి దురాశల - నవివేకినై కూడి యాడితి = మొద్దులతో నింక కూటమి - వద్దయ్య వద్దయ్య  వద్దయ్య తండ్రి ||నన్ను|| 

3.కాలము పెక్కు గతించెను - గర్వాదు లెడ దెగ వాయెను = ఈ లోక మాయ సుభేచ్ఛలు - చాలును జాలును  జాలు నో తండ్రి ||నన్ను|| 

4.దారుణ సంసార వారధి - దరి జూపి ప్రోవ నీ కన్నను = కారణ గురువు లింకెవ్వరు - లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||

5.నా వంటి దుష్కర్మజీవిని - కేవల మగు నీదు పేర్మిని = దీవించి రక్షింప నిప్పుడే - రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను|| 
- పురుషోత్తము చౌదరి
-------------------------------------------
Nannu gannayya rave naa yesu = nannu gannayya rave naa prabhuva ||Nannu||

1.Mundu nee paadara vindamu - landu nischala bhakti premanu = pondikaga jeya raave naa - denda maananda mananatha mai yupponga ||Nannu||

2.Haddu lenatti durashala - navivekinai kudi yadithi = moddulatho ninka kutami - vaddayya vaddayya vaddayya thandri ||Nannu||

3.Kaalamu pekku gathinchenu - garvadu ledadega vaayenu = ee loka maaya sukechalu - chaalunu jaalunu jaaluno thandri ||Nannu||

4.Dharuna samsara vaaradhi - dari jupi prova ni kannanu - kaarana guruvu linkevvaru - lerayya lerayya lerayya thandri ||Nannu||

5.Naavanti dhuskarma jeeviki - kevala magu needu permini = deevinchi rakshimpa nippude - ravayya ravayya ravayya thandri ||Nannu||
  - Purushothamu choudari
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...