Showing posts with label Bro. Anil Kumar songs. Show all posts
Showing posts with label Bro. Anil Kumar songs. Show all posts

03 December 2022

Premalo paddanu nenu premalo | ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో

ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను

ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను…
ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను
నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను
ప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను
నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను
స్వార్ధ్యం కలిగిన ప్రేమ కాదు - లాభం కోరే ప్రేమ కాదు
కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు - ఆహ శాశ్వతమైన యేసుని ప్రేమ
మోహం కలిగిన ప్రేమ కాదు - మోసం చేసే ప్రేమ కాదు
పై అందం చూసే ప్రేమ కాదు -పరిశుద్ధమైన ప్రేమ
ఇదే కదా ప్రేమంటే (2)
ఈ లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ
దేవుని ప్రేమ ఇది ||ప్రేమలో||

మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు
నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే
మొదటగా ప్రేమించింది నేను కాదు
నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే
కోరినాడు పిలిచినాడు - నేను ఎదో మంచి వ్యక్తినైనట్టు
కుమ్మరించే ప్రేమ మొత్తం - నేను తప్ప ఎవ్వరు లేనట్టు
ఆకశాన తనలో తాను - పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు
భువిలో నాపై ప్రేమ ఎందుకో
ఏమి తిరిగి ఇవ్వలేని -ఈ చిన్న జీవి పైన
ప్రభువుకు అంత ప్రేమ దేనికో
హే… ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక
నేను ప్రేమించకుండ ఎట్లా ఉంటాను
అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి
ఐ లవ్ యు చెప్పకుండ ఎట్లగుంటాను ||ఇదే కదా||

తన ప్రేమకు ఋజువేంటని నేనడుగక ముందే
నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచె
ప్రేమకు ఋజువేంటని నేనడగక మునుపే
నా యేసు తన ప్రేమ రుజువు పరిచె
పాపమనే కూపమందు - నేను బంధీనైయుండఁగా
పాపమనే అప్పు చేత - బానిసై నేను అలసియుండగా
గగనపు దూరము దాటి వచ్చి - సిలువలో చేతులు పార చాపి
నువ్వంటే నాకింత ప్రేమనే
రక్తముతో నను సంపాదించి - నా కళ్ళల్లో కళ్ళు పెట్టి
నీపై పిచ్చి ప్రేమ నాకనే
హే… నన్ను తన సొత్తు చేసుకున్నాడు
నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు
మరల వచ్చి పెళ్లి చేసుకుంటాడు
అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు ||ఇదే కదా||

ప్రేమతో నా ప్రియుడు రాసెను ప్రేమ లేఖ
వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ
ప్రేమతో నా యేసు రాసెను ప్రేమ లేఖ
వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ
ఆ లేఖ చదువుతుంటే - నా ప్రియుని తలపులు నాలో నిండే
ప్రభుని ప్రేమ లోతు తెలిసి - నా యేసుపై పొంగి పొరలే
రేయింబవలు ప్రభు కావాలని – తనతో ఎప్పుడు కలిసుండాలని
నా ప్రాణము పరి తపియించెనే
యుగయుగములు నన్నేలేడివాడు - అని త్వరలోనే రానున్నాడని
ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే
హే… వింత అయిన ఆ యేసు ప్రేమ గూర్చి
నేను సర్వ లోకమునకు చాటి చెబుతాను
యేసు రక్తమందు శుద్ధులైన వారే
ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను ||ఇదే కదా|

15 February 2022

Edhigo vinuma o lokama | ఇదిగో వినుమా ఓ లోకమా

ఇదిగో వినుమా ఓ లోకమా త్వరలో ప్రభువు రానుండెను

ఇదిగో వినుమా ఓ లోకమా త్వరలో ప్రభువు రానుండెను
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా 
మరనాత... ||ఇదిగో||

మహా మహా ఆర్భాటముతో - ప్రధాన దూత శబ్దముతో
దేవుని బూరతో ప్రభువు వేగమే దిగివచ్చును   
ప్రభునందు మృతులు లేతురు సమాధులు తెరువగ
విశ్వాసులంత దాల్తురు మహిమ రూపును వింతగ
ఎత్తబడును సంఘము అయ్యో విడువబడుట ఘోరము
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా  
మరనాత... ||ఇదిగో||

ఏడేండ్లు భువిపై శ్రమకాలం - ప్రాణాలు జారే భయకాలం
ఊరలు తెగుళ్ళు దైవ ఉగ్రత పాత్రలు
ఆకాశ శక్తుల్‌ కదలును గతి తప్పును ప్రకృతి
కల్లోలమౌను లోకము రాజ్యమేలును వికృతి
సంఘమెంతొ హాయిరా మధ్యాకాశన విందురా
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా  
మరనాత... ||ఇదిగో||

అన్యాయము చేయువాని చేయనిమ్ము
అపవిత్రుడట్లే యుండనిమ్ము
పరిశుద్ధుడింకను పరిశుద్ధునిగుండనిమ్ము
ప్రతివాని క్రియల జీతము ప్రభు తెచ్చును ఒక దినం
రహాస్య క్రియలు అన్నియు బయలుపడునులే ఆ దినం
లోక ధనము కూడిరా నీకుంద పై సంపద ఆ...ఆ...
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా  
మరనాత... ||ఇదిగో||

ఓలీవకొండపై రారాజు అడుగుపెట్టెడి ఆరోజు
కొండయే చీలును భూగోళమే కంపించును
ప్రతి జనం ప్రభునే చూచును ప్రతి జాతియు మ్రొక్కును
నిజమైన ప్రభువు యేసని ప్రతి నాలుక ఒప్పును
ప్రభుని రెండవ రాకడ సాతానుకు దడదడ ఆ....ఆ...
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా  
మరనాత... ||ఇదిగో||

వెయ్యేండ్లు భూమిపై ప్రభు యేసు పాలించును పరిపాలించును
నీతి సమాధానం ఆత్మయందలి ఆనందం
ఈ భూమ్మీద నీ కృత్యముల్‌ సమస్తం కాలిపోవును
మిక్కటమైన వేడితో పంచభూతముల్‌ లయమగును
క్రొత్త భూమి ఆకాశం ఇక శాశ్వత జీవితం
సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా  
మరనాత... ||ఇదిగో||

క్రీస్తేసులో విశ్వసించువారే పరిశుద్ధులుగా తీర్చబడ్డవారే
దేవుని మహిమకు నిత్యజీవమునకు అర్హులు
జీవం మరణం రెండును నీ యెదుటనే యున్నవి
ప్రభు యేసే జీవ మార్గమని నీకు తెలుపబడియున్నది
విశ్వసించు ప్రియుడా కాదు ....

సిద్ధపడుమా ఓ లోకమా సిద్ధపడుమా ఓ సంఘమా      

13 August 2021

Krupa Krupa Naa Yesu Krupaa | కృప కృప నా యేసు కృపా

కృప కృప నా యేసు కృపా

కృప కృప నా యేసు కృపా...కృప. కృప. కృపా (2)
నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే -
నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివే

నేనేమైయుంటినో అందుకు కాదయ్యా - 
నా క్రియలను బట్టి అసలే కాదయ్యా
చూపావు ప్రేమ నాపై - పిలిచావు నన్ను కృపకై
జనములకు ప్రవక్తగా నను నియమించావయ్యా -
నా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప||

నాపై నీవు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యా -
కలలోనైనా నిన్ను మరువనె లేనయ్యా
రుచిచూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా - 
నీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యా
నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై - 
నన్నాకర్షించావయ్యా
నువ్వులేని నన్ను ఊహించలేను - 
నా శిరస్సు నీవయ్యా
నా గుర్తింపంతా నీవే యేసయ్యా - 
నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమై||

నా పాపము నను తరుమంగా నీలో దాచితివే -
నే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివే
నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే -
ఇకపై పాపము చేయకని మార్గము చూపితివే
నీ మంచితనమే కలిగించె నాలో - 
మారు మనస్సేసయ్యా
నేనెంతగానో క్షమియించబడితిని - 
ఎక్కువగా ప్రేమించితివయ్యా
నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా - 
నా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమై||

పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా -
నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా-
నను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా
నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా
ఏముంది నాలో నీవింతగా నను - 
హెచ్చించుటకు యేసయ్యా
ఏమివ్వగలను నీ గొప్ప కృపకై - 
విరిగిన నా మనస్సేనయ్యా
నీ కొరకే నేను జీవిస్తానయ్యా - 
మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమై||

పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యా
అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా
నీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా
విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా
నీలోన నేను నాలోన నీవు - 
ఏకాత్మ అయితిమయ్యా
జీవించువాడను ఇక నేను కాను - 
నా యందు నీవయ్యా
నీ మనసే నా దర్శనమేసయ్యా - 
నీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమై||

DOWNLOAD MP3 SONG HERE 👇

22 February 2021

Shudha Hrudayam Kaluga | శుద్ధ హృదయం కలుగ

శుద్ధ హృదయం కలుగజేయుము

శుద్ధ హృదయం కలుగజేయుము(2)
నాలోనా. నాలోనా. నాలోనా..నాలోనా ||శుద్ధ||

నీ వాత్సల్యము- నీ బాహుల్యం -
నీ కృప కనికరము చూపించుము (2)
పాపము చేశాను - దోషినైయున్నాను (2)
తెలిసియున్నది నా అతిక్రమమే - 
తెలిసియున్నది నా పాపములే (2)
నీ సన్నిధిలో - నా పాపములే ఒప్పుకొందునయ ||శుద్ధ||

నీ జ్ఞానమును- నీ సత్యమును -
నా అంతర్యములో పుట్టించుము (2)
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం -
కలుగజేయుము నా హృదయములో (2)
నీ సన్నిధిలో- పరిశుద్దాత్మతో నన్ను నింపుమయా ||శుద్ధ||

Download MP3 song Here 👇

13 August 2020

Yuddamu Yehovade Yuddamu | యుద్ధము యెహోవాదే

యుద్ధము యెహోవాదే

యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే (2) 
రాజులు మనకెవ్వరు లేరు- శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతియైన - యెహోవా మన అండ 
యుద్ధము యెహోవాదే (4) 

1. బాధలు మనలను కృంగదీయవు - వ్యాధులు మనలను పడద్రోయవు (2)
విశ్వాసమునకు కర్తయైన - యేసయ్యే మన అండ
యుద్ధము యెహోవాదే (4) 

2. యెరికో గోడలు ముందున్న - ఎఱ్ఱసముద్రము ఎదురైన (2)
అద్భుత దేవుడు మనకుండగా - భయమేలా మనకింక
యుద్ధము యెహోవాదే (4) 

3. అపవాదియైన సాతాను - గర్జించు సింహమువలె వచ్చిన (2)
యూదా గోత్రపు సింహమైన - యేసయ్యే మన అండ
యుద్ధము యెహోవాదే (4)

Download here MP3 song 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...