Showing posts with label Palle Pallello Pattanala Mulallo lyrics. Show all posts
Showing posts with label Palle Pallello Pattanala Mulallo lyrics. Show all posts

01 June 2021

Palle Pallello Pattanala Mulallo | పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో

పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో వాడ వాడల్లో సొగసైన మేడల్లో (1)
యేసు వార్త చాటను పదరో తమ్ముడా నాకేమని అనబోకురో (2)

1. ఈ సువార్త అసలు వినని జనులెందరో -యేసు లేక నశియించు ప్రజలెందరో (2)
ప్రకటించే బాధ్యత నీమీద ఉన్నది- దారి చూపే భారం నీకీయబడినది (2)
యేసయ్య నిజ దేవుడని ఎలుగెత్తి చాటరో (2)
                                              ||పల్లె పల్లెల్లో||
2. నువ్వు మాత్రం తెలుసుకొని ఊరకుంటావా - సొంత పనులు చూసుకొంటూ సంతసిస్తావా(2) కోతెంతోవున్నా పనివారు లేరని -అడుగు చున్నాడేసు తనపని చేయమని(2) యేసయ్యను నమ్ముకోమని ఎలుగెత్తి చాటరో (2)
                                                ||పల్లె పల్లెల్లో||
3. రాకడకు గురుతులు కనిపించు చుండగా- అంతం అతి దగ్గరగా వచ్చుచుండగా(2)
సమయం అసమయమనక సందేహపడక- దొరికిన అవకాశమేది జారవిడువక(2) 
యేసయ్య తిరిగొస్తాడని ఎలుగెత్తి చాటరో(2)
                                                    ||పల్లె పల్లెల్లో||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...