Showing posts with label Nee Siluva Shramalu Dhyaninchalani lyrics. Show all posts
Showing posts with label Nee Siluva Shramalu Dhyaninchalani lyrics. Show all posts

29 May 2021

Nee Siluva Shramalu Dhyaninchalani | నీ సిలువ శ్రమలు ధ్యానించాలని

నీ సిలువ శ్రమలు ధ్యానించాలని - 
నీ సముఖములో తరించాలని (2)
మాలిన్యమునకు దూరంగా - నీష్టమైన యాగంగా
జీవితం మలచుకోవాలనే - పవిత్ర సాధన దీక్ష -
ఇది సిలువ దీక్ష - స్వపరీక్ష 

1.మానవపాప పరిహారార్థం భువికేతెంచిన నీవు -
సిలువను మోసి మరణమునొంది నీపని ముగించినావు (2)
నా సిలువను నేనెత్తుకొని - నన్ను నేను తగ్గించుకొని (2)
నీ అడుగులలో నడవాలనే - పవిత్ర సాధన దీక్ష -
ఇది సిలువ దీక్ష - స్వపరీక్ష ||నీ సిలువ||

2.లోక పాపాలగూర్చిన బాధతో రక్తమాయె నీ స్వేదం-
గెత్సెమనెలో మోకాళ్ళ పైన మ్రోగెను ప్రార్థననాదం (2)
నా పాపక్రియలకొరకై నే - పశ్చాత్తాప హృదయముతో(2)
ఆత్మీయ వసంతం పొందాలనే - పవిత్ర సాధన దీక్ష - ఇది సిలువ దీక్ష - స్వపరీక్ష ||నీ సిలువ||

3.పరోపకారమే ఆహారంగా ఇలలో జీవించినావు -
ప్రేమ కలిగియుండుమని బోధించి - మాదిరి చూపించినావు (2)
శత్రువుకై ప్రార్థించిన - అందరికి మేలు చేసిన 
నీ మనసు కలిగియుండాలనే - పవిత్ర సాధన దీక్ష - 
ఇది సిలువ దీక్ష - స్వపరీక్ష ||నీ సిలువ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...