Showing posts with label ఏ.బి. మాసిలామణి. Show all posts
Showing posts with label ఏ.బి. మాసిలామణి. Show all posts

20 August 2021

Devuni goppa premanu | దేవుని గొప్ప ప్రేమను కలంబు

65 
The Love of God

1.దేవుని గొప్ప ప్రేమను - కలంబు తెల్పజాలదు 
అత్యున్నత నక్షత్రమున్ - అధోగతిన్ ఆవరించున్ 
నశించు జాతిన్ రక్షింపన్ - సుతుని బంపెను 
పాపంబు నుండి పాపికి - విశ్రాంతి జూపెను.

      ||దేవుని ప్రేమ సంపద 
        అపారమైనది
        నిరంతరంబు నిల్చును 
        ప్రేమ సంగీతము ||

2.యుగాంతకాల మందున - భూ రాజ్యముల్ నశించగా 
యేసున్ నిరాకరించువారు - చావును కోరు వేళను 
దేవుని ప్రేమ గెల్చును - అనంత జీవము 
నశించు వారి కాశ్రయంబు - ప్రేమ సందేశము 

3. సముద్రము సిరాతో నిండి - ఆకాశమె కాగితమై 
కొమ్మల్లె కలంబులె - ప్రతి నరుండు కరణమై 
దేవుని ప్రేమన్ చిత్రింపన్ - సంద్రంబు యింకును 
ఆకాశ వ్యాప్తి యంతయు - చాలక పోవును
                     - అను : ఏ.బి. మాసిలామణి

12 July 2020

Madhura madhura madhura seva | మధుర మధుర మధుర సేవ

698
రా - తిలక్కామోదు,   తా - ఆది

మధుర మధుర మధుర సేవ - యేసుప్రభు సేవ
   
1.దేవ దూతలకును లేని దైవజనుని సేవ - దేవ సుతుని సంఘ సేవ దివ్యమౌసువార్త సేవ॥మధుర||

2.పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లు సేవ - పరిమళించు వాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్యసేవ ||మధుర||

3.ప్రభుని పేరప్రజల యెదుట ప్రవచనాల సేవ - ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్థనలువచించు సేవ ||మధుర||

4.భాగ్యభోగనిధులు లేని భారభరిత సేవ - బాష్ప సిరులలోన మెలగి బాధలను వరించుసేవ ||మధుర||

5.సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ - సిలువ నిందనలు భరింప శిరము వంచి మురియు సేవ ||మధుర||

6.లోకజ్ఞాని యపహశించు వోకమూర్తి సేవ - లోకులను దీవించుసేవ లోకమును జయించుసేవ॥మధుర||

7.దైవజనుడ మరువకోయి దైవపిలుపునోయి - దైవనీతి వదలకోయి దేవుడు దీవించునోయి ॥మధుర||
                             - ఏ.బి. మాసిలామణి
DOWNLOAD MP3 SONG HERE 👇

26 May 2020

Andala tara arudenche | అందాల తార అరుదెంచె

697
1.అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో 
అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవని జాటుచున్(2)
ఆనందసంద్ర ముప్పొంగె నాలో - అమరకాంతిలో 
ఆది దేవుని జూడ ఆశింప మనసు - పయనమైతిని ||అందాల||

2.విశ్వాస యాత్ర దూరమెంతైన - విందుగదోచెను
వింతైన శాంతి వర్షించె నాలో - విజయపధమున
విశ్వాల నేలెడి దేవకుమారుని - వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించే ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ ||అందాల||

3.యెరూషలేము రాజనగరిలో - యేసుని వెదకుచు
ఎరిగిన దారి తొలగినవేళ - యెదలో కృంగితి
యేసయ్యతార యేప్పటివోలె - యెదురాయె త్రోవలో
ఎంతో యబ్బుర పడుచు - విస్మయ మొందుచు - యేగితి స్వామికడకు ||అందాల||

4.ప్రభు జన్మస్థలము పాకయేగాని - పరలోక సౌధమే బాలునిజూడ జీవితమంత పావనమాయెను 
ప్రభు పాదపూజ దీవెన కాగ - ప్రసరించే పుణ్యమే
బ్రతుకే మందిరమాయె - అర్పణలే సిరులాయె - ఫలియించె ప్రార్థన ||అందాల||
                  – ఏ. బి మాసిలా మణి
_________________________________
1.Andala tara arudenche nakai - ambara veedhilo
Avatara Murthy yessaiah Keerthi avani jaatuchun
Ananda samdra mupponge naalo Amara kaanthi lo 
Adi devuni juda ashimpa manasu payanamaitini ||Andala||

2.Vishwasa yaatra duramenthaina   vindugadochenu
vinthaina shanthi varshinche naalo vijaya padhamuna
Vishwalaneledi devakumaruni Veekshinchu deekshatho
Virajimme balamu pravahiche Prema
Vishraanthi nosaguchun..||Andala||

3.Yerushalemu rajanagarilo yesuni vedakuchu 
Yerigina dari tolagina vela yedalo krungithi
Yessaiah tara yeppativole yeduraye throvalo 
Yentho abhura paduchu vismaya mondhuchu 
yegithi swami kadakuu ||andala||

4.Prabhu janma sthalamu paakaye gaani  paraloka soudhame
Baaluni juda jeevitha mantha paavana maayenu
Prabhu paada puja deevena kaaga
Prasarinche punyamu
Bhrathuke mandira maye arpanale sirulaaye   phaliyinche prardhana ||Andala||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...