Showing posts with label మిక్కిలి నమూయేలు. Show all posts
Showing posts with label మిక్కిలి నమూయేలు. Show all posts

20 August 2021

Kreesthu naayaka nee dayalini | క్రీస్తు నాయక నీ దయాళిని

90
యేసుక్రీస్తుకు స్తుతి
రా – బిలహరి,తా - త్రిపుట
 (చాయ: యేసునాధ కథా)

క్రీస్తునాయక నీ దయాళిని - కీర్తనలుగా బాడుదున్ - ¹నేస్తుతులతోఁ దండ్రి దేవుని - నిత్యమును ²గొండాడుదున్ || క్రీస్తు||

1.సిలువ మోసిన నీ ప్రయాసను - జెప్పుటకు నోరాడదు = ³అలుకునొందక స్వామి నీ ⁴ది - వ్యాంఘ్రి చెంతను గూడుదు || క్రీస్తు ||

2.నిమిషమైన న్బాయకెదలో - నిన్ను నే స్మరియింతును = అమితమౌ దేవా ⁵ను క్రోశము - హర్షముగ వర్ణింతును ||క్రీస్తు ||

3.యేసుప్రభు నా కాలమంతయు - నేమఱక నీ నామము = దాసునిగ భజియంతు నిఁక నేఁ - దప్పకుండను నీమము || క్రీస్తు||

4.చచ్చి నే నరుదెంచి మోక్షము - స్వామి నీ యుపకారముల్ = హెచ్చు ప్రేమను బాడుచుందును - యెప్పుడును ⁶గైవారముల్ || క్రీస్తు||

5.మలినమౌ నా నత్తి నాల్క స - మాధిలోఁ గృశియింపను = బలిమితోనేఁ బాడుచుందును - భక్తి ⁷యుజ్వలింపను ||క్రీస్తు||

6.కన్ను మూతలుగాను నీ సము - ఖంబు కేను బిరాలను = తెన్ను తప్పకవత్తు శ్రీకర - దేవ నను నీవేలను ||క్రీస్తుll

7.ముగ్గురొకఁడై వెల్గుచుండెడి - మోక్షరాజ్య ⁸గరిష్ఠుఁడా = మొగ్గుచేయక నన్నుఁ బ్రోవవే - యేసునాధ ⁹మహేశుఁడా || క్రీస్తుll

8.భూతలములో నీ సమానముఁ - బోల్చ నేదియుఁ గానము = దాతవై మము సలుపవే నీ - తండ్రికిని ¹⁰సంధానము ||క్రీస్తుll
 – మిక్కిలి నమూయేలు
___________________________
¹స్నేహితులతో. ²స్తుతింతును. ³భయము. ⁴పరిశుద్ధపాపదము. ⁵కనికరము. ⁶స్తోత్రములు. ⁷ప్రకాశింపను. ⁸గొప్పవాడా. ⁹గొప్పదేవుడా. ¹⁰కూడిక

19 August 2021

Ghana bhava dupakruthulanu | ఘన భవ దుపకృతులను మాటికి

68
ప్రభువైన యేసునకు స్తుతి
రా – ఆనందభైరవి,  తా – ఆది
(ఛాయ: యేసువంటి ప్రియబంధుఁడు)
               
¹ఘన ²భవ దుపకృతు - లను మాటికి నే - వినుతింతును దే - నిజసుత = యొనరఁగ నాపై - ³ననుక్రోశముఁ దగ - ⁴నునుపవే క్రైస్తవ - జన విహిత || ఘన ||

1.ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా = ⁵పారముఁ దప్పిన - పాతకు నగు నే నారడివడ నీ - కది బిరుదా॥ఘన||

2.జలబుద్బుదముతో - సమ మని నాస్థితి - తెలియద నీకది - దేహధరా ఖలమయ మగు నీ - కర్మినిఁ బ్రోవను - సిలువను బొందిన - శ్రేయఃకరా || ఘన||

3.మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ ⁶సు - నంద నా = యందముగా నా ⁷డెందము కడుఁ దెలి - వొందఁగ నీ దయ - నందు మా || ఘన ||
                           - మిక్కిలి నమూయేలు
____________________________
¹గొప్పయైన. ²నీ ఉపకారములను. ³ప్రేమ. ⁴ఉంచుము. ⁵గట్లు లేక మేర. ⁶సుపుత్రుఁడా. ⁷హృదయము .

17 August 2021

Vinave naa vinathi nivedana | వినవే నా వినతి నివేదన

49
సాయంతన సమర్పణము
రా – నాదనామక్రియ,  తా – ఆది
                   
వినవే నా వినతి నివేదన దయ - వెలయఁగ నో ప్రభువా = నిను శర నొందితి ననుఁ గుశలంబున - నునుపవె యో ప్రభువా ||వినవే||

1.నిర్మల గతి సంధ్యా కాలంబున - నీ స్తవ మగు ప్రభువా = ¹ధర్మదీప్తి నా కొసఁగి చేయు - ²దీప్త వంతునిగ నన్ను ||వినవే||

2.నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని - నేఁబడకుండఁగనుు =  ³తన్వాది సమస్తముతో - ననుఁ గావవె ప్రభువా ||వినవే||

3.ఎన్ని దినంబులు జగతి నున్న నీ - కన్న వేరే గలవా = పన్నుగ మది నీ ⁴పద సంగతమై - యున్నది రేవగలు ||వినవే||

4.పాప కరుండను నే ⁵సుకృతా - పాది కర్మ మెఱుఁగ = నీ పాద ⁶సరోజము నా కొసఁగుము - నాపై నీ కృపఁ జెలఁగ ||వినవే||

5.నీ కొరకై నా మనము దృఢంబౌ - గాక యేసు ప్రభువా = నాకుఁ బిశాచముచే భ్రమ జన్మము - గాకుండఁగ నేలు ||వినవే||
– మిక్కిలి నమూయేలు
_______________________
¹పరిశుద్ధమైన వెలుఁగు. ²వెలుఁగుగలవానిగా. ³శరీరము మొదలైన. ⁴పాదములతో గూడుకొనునది. ⁵నత్కార్యములను పుట్టించు. ⁶పద్మము

Melukonare meeananbula | మేలుకొనరే మీ మనంబుల

41
ఉదయారాధన
(ప్రాత: కాల కీర్తన)
రా – బిలహరి, తా - త్రిపుట

మేలుకొనరే మీ మనంబుల - మేలిమిగ మీ మేరఁ దప్పక = పాలు మాలక లేచి దేవుని - పాదములు పూజింప గ్రక్కున ||మేలుకొనరే||

1.దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుం డుదయింపనయ్యెను = ఋక్కులకు ప్రతిఫలము నిచ్చెడు - మూల కర్తకుఁ గొలువ సేయఁగ ||మేలుకొనరే||

2.పక్షు లెల్లను గిలకిలంచును - బ్రభుని మహిమలు బ్రభుని మహిమలు బల్కఁ దొడఁగెను = రక్షకుని సకలోపకృతులను - రమ్యముగ నుతియించి పాడఁగ ||మేలుకొనరే||

3.నిదుర బోయిన వేళ మిమ్మక - నిమిషమైనను బాసియుండక = పదిలముగ రక్షించు దేవునిఁ - బ్రస్తుతింప మహాముదంబున ||మేలుకొనరే||

4.మేటియౌ హృదయాబ్దములలో - ఈ కృతాజ్ఞతా భూషణంబులు = నేటుగా ధరియించుకొని యిటు - నిర్మలాత్మునిఁ బూజసేయఁగ ||మేలుకొనరే||

5.తెల్లవారఁగఁ దెలియరే యిది - తెలివిగల మానవ సమాజము = యుల్లసిల్లుచు నీతి భాస్కరుఁ - డు దయ మయ్యెను హృదయముల పై ||మేలుకొనరే||
 - మిక్కిలి నమూయేలు

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...