Showing posts with label 083 రారే మన యేసు స్వామిని. Show all posts
Showing posts with label 083 రారే మన యేసు స్వామిని. Show all posts

20 August 2021

Rare Mana Yesu Swamini | రారే మన యేసు స్వామిని

83
క్రీస్తును చూడ రండి
రా – శంకరాభరణము, తా – ఆది
                          
రారే మన యేసు స్వామిని - జూతము కోర్కె - ¹లూర ప్రియు లారా ²పేర్మిని = ³గూరిమి భక్తులఁ - ⁴విందట భూరిద ⁵యామృత - సారము లొలికెడు - ¹చారు కటాక్ష ²వి - శాలేక్షణుఁడఁట - ³నారకులగు ⁴నర - నారీజనులకు - ⁵దారక మొసఁగను - దానె పిలుచునఁట - ⁶దారుణ పాప మ హారణ్యమునకుఁ - ⁷గారుచిచ్చు గతి - గన్పడువాఁడట - ఘోర దరిద్రతఁ - గూల్చెడివాఁడట = సారం బగు తన - సభకు ⁸మకుటమఁ ట ||రారే||

1. ⁹పతిత పావనమౌ వేల్పఁట - అనాది దేవ - సుతుడై యిలఁ జేరి నాఁడఁట = ¹⁰సతతము కడు ¹¹దురి - ప్రతి దేశమునకు ¹²హితభాస్కరుఁడఁట - ¹³అతులిత ¹⁴మోక్షో - న్నత గుణగణుఁడఁట ¹⁵కుతలంబున ¹⁶న - ఛతి రహితంబగు పతితులఁ గావను - మృతుడైనాఁ డఁట - అతిపుణ్య ¹⁷తను - క్షత శోణితమును - ¹⁸వ్రతముగ సిలువను - నతడొసంగెనఁట - మృతిని జయించుచు - బ్రతికి లేచెనంట మతి నమ్మిన మన - గతి యితఁడేనఁట || రారే||

2.తుదలేని మహిమవాఁడఁట - తనుఁగొల్చు సాధు - హృదయుల సొమ్ము మూటఁట = చెదరిన గొఱ్ఱెల - ¹⁹వెదకవచ్చెనంట - చిదురు పలగు - జన హృదయము లన్నిటఁ - బదిలముగా నె - మ్మది నిడువాఁడఁట - ²⁰నదితట ²¹మఠ ²²జన - వదనముల ²³స - మ్మద శుభవార్తనుఁ - బలికిన వాఁడఁట - సదయత ²⁴నంధుల - ²⁵కక్షుల ²⁶నిడెనఁట - వెదకి ²⁷బధిరులకు - ²⁸వీను లొసఁగె నంట - ²⁹సదమల ³⁰మోక్ష - ప్రదుఁడగు విభుఁడఁట = యిదిగో మనకిత - డేలినవాఁడఁట || రారే ||
- పురుషోత్తము చౌదరి
______________________________
¹వృద్ధిపొందినట్లు.  ²ప్రేమచేత.  ³ప్రేమచేత ⁴బంధువుఁడు. ⁵అమృతము యొక్క రసము. ¹సుందరమైన. ²పెద్దనేత్రములుగలవాఁడు. ³నరకసంబంధులు. ⁴పురుషుల స్త్రీలునగు. ⁵ఆధారము. ⁶భయంకరమైన. ⁷అడవినిప్పు. ⁸కిరీటము. ⁹పాపులను పవిత్రముచేయు.¹⁰నిత్యము. ¹¹పాపమనెడు చీకటితో గూడుకొనిన. ¹²అనుకూలమైన సూర్యుడు.¹³సమానములేని. ¹⁴మోక్షమకంటె ఉన్నతమైనగుణ సమూహము గలవాఁడు. ¹⁵భూమియందు. ¹⁶సడతిలేని. ¹⁷శరీరముయొక్క గాయపు రక్తమును. ¹⁸పట్టుదలగా. ¹⁹ముక్కలు. ²⁰నదీతీరములయందు. ²¹గుళ్లలో.  ²²గ్రామములలో. ²³సంతోషముతో. ²⁴గ్రుడ్డివారికి. ²⁵కన్నులు. ²⁶ఇచ్చెను. ²⁷చెవిటివారికి ²⁸చెవుడు ²⁹పరిశుద్ధమైన. ³⁰మోక్షమిచ్చువాఁడు.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...