Showing posts with label Thriyeka Deva Nin Sthuthiyinchuta lyrics. Show all posts
Showing posts with label Thriyeka Deva Nin Sthuthiyinchuta lyrics. Show all posts

25 May 2021

Thriyeka Deva Nin Sthuthiyinchuta | త్రియేక దేవ దేవుడు మనకందరికీ

త్రియేక దేవ దేవుడు మనకందరికీ తోడైయుండు గాక 

త్రియేక దేవా నిన్ స్తుతియించుట -
కొనియాడి కీర్తించ మా భాగ్యము (2)

1. మా పాదములను బండపై నిలిపి (2)
    మా అడుగులను నీవు స్థిరపరచినావు 
    మా నోట నూతన కీర్తననుంచి (2)
    నీ సాక్షులనుగా ధర నిలిపినావు 
                                          ||త్రియేక దేవా||
2. మా యెడల జరిగించు ఆశ్చర్యక్రియలు (2)
     మా యెడల నేర్పున్న విస్తార తలపులు 
     వివరింప తరమా కొనియాడ గలమా (2)
     నీ ఘనతలకు సాటి ఎవరైనా కలరా 
                                         ||త్రియేక దేవా||
3. నైవేద్యములను కోరవు నీవు (2)
    బలిఅయిన నీవు కోరుటలేదు
    నీ చిత్తమును ఇల నెరవేర్చవలెనని (2)
    నీ మార్గమను మాకు బోధించినావు
                                         ||త్రియేక దేవా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...