Showing posts with label ఎ. చార్లెస్ కిన్సింగర్. Show all posts
Showing posts with label ఎ. చార్లెస్ కిన్సింగర్. Show all posts

02 May 2022

Kreesthesu shakthinaamamellaru | క్రీస్తేసు శక్తినామమెల్లరు

146 
క్రీస్తే రారాజు
రా - శంకరాభరణం, తా - ఆది

క్రీస్తేసు శక్తినామమెల్లరు - కీర్తించి కొల్వుడిలన్ యెపుడు = కీర్తి కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||

1.సాష్టాంగపడి దూతల్ పరమున - నిష్ఠతో గొలుచుచును యేసుని = కీర్తి కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||

2.హతసాక్ష్యపు జనమా యేసుడె - హితమతితో బిలుచున్ మిమ్ముల = కీర్తి కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||

3.ఇశ్రాయేల్ ప్రజలారా యిచ్చెను - ఆశ్రయ రక్షణను యేసుడే = కీర్తి కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||

4.పాపుల రక్షించెన్ సిలువపై - శాపము దొలగించెన్ యేసుడే = కీర్తి కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||

5.సర్వజనంబులారా క్రీస్తుని - సర్వజగంబులలో ఠీవిగ = కీర్తి కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి ||క్రీస్తే||

6.పరమందున్నట్టి ప్రభుదగు - పరిశుద్ధ సంఘముతో మనము = కీర్తి కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తు నారాధింతము ||క్రీస్తే||
                    – ఎ. చార్లెస్ కిన్సింగర్

02 January 2022

Jayaprabhu Yesune Vembadinchuchu | జయప్రభు యేసునె వెంబడించుచు

462
యేసును వెంబడించుము
రా – శకరాభరణం,  తా – ఆది

జయప్రభు యేసునె వెంబడించుచు - జయముగ నడచెదము - యేసుతో జయముగ వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని - పయనము జేసెద మా ప్రభు వెంబడి ||జయప్రభు||

1.ఆదరణయు అధికబలమును - ఆత్మఖడ్గమును అవనిలో అందరి రక్షయును = ఆదర్శంబౌ ఆయన వాక్యమే - అనిశము మనకిల మార్గము చూపగ ||జయప్రభు||

2.ధర విరోధులు మమ్ము జుట్టగ - దరి జేరెద మేసున్ - ప్రభుని దరిజేరెద మేము = ధాత్రి దురాశల డంబములన్నిటి - మైత్రిని వీడి నడచెద మేసుతో ||జయప్రభు||

3.మా ప్రభు జూముము నీదు మార్గపు - మాదిరి జాడలను - నీ దగు = మాదిరి జాడలను = మా పాదములను తొట్రిలకుండగ - మా కిడు బలమును యీ కృపాదినమున ||జయ ప్రభు||

4.మా కొరకై నీవు నడచిన - మార్గము జూడగను - మేము మార్గము జూడగను = మా రక్షక నీ అడుగుజాడలు - మరువక విడువక నడువగ కృపనిడు ||జయప్రభు||

5.ఇహపరముల నినుగాక ప్రేమతో - ఎవరిని గొలిచెదము? - ఎవరిని ప్రేమింప వశమె? - విహరించెదము యేసుని వెంబడి - మహిమ రాజ్యమున యేసుని గొలువగ ||జయప్రభు||
– ఎ. చార్లెస్ కిన్సింగర్


Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...