Showing posts with label jaya jaya yesu jaya yesu lyrics. Show all posts
Showing posts with label jaya jaya yesu jaya yesu lyrics. Show all posts

16 August 2020

Jaya jaya yesu jaya yesu | జయ జయ యేసు జయయేసు

651
జయ జయ యేసు జయయేసు - 
జయ జయ క్రీస్తు జయ క్రీస్తు
జయ జయ రాజా జయ రాజా - 
జయ జయ స్తోత్రం జయసోత్రం ||జయ||

1. మరణము గెల్చినజయ యేసు - 
    మరణము ఓడెను జయ యేసు 
    పరమ బలమొసగు జయయేసు - 
    శరణము నీవే జయ యేసు ||జయ||

2. సమాధి గెల్చిన జయ యేసు - 
    సమాధి ఓడెను జయ యేసు 
    క్షమించుము నను జయ యేసు - 
    అమరమూర్తివి జయ యేసు ||జయ||

3. సాతాను గెల్చిన జయ యేసు - 
    సాతాను ఓడెను జయ యేసు 
    పాతవి గతియించె జయ యేసు - 
    దాతవు నీవే జయయేసు ||జయ||

4. బండను గెల్చిన జయ యేసు - 
    బండయు ఓడెను  జయ యేసు 
    బండలు దీయము జయ యేసు - 
    అండకు జేర్చుము జయ యేసు ||జయ||

5. ముద్రను గెల్చిన జయ యేసు - 
    ముద్రయు ఓడెను జయయేసు 
    ముద్రలు జీల్చుము జయ యేసు - 
    ముద్రించుము నను జయ యేసు ||జయ||

6. కావలిగెల్చిన జయయేసు - 
    కావలి ఓడెను జయ యేసు - 
    సేవలో బలమును జయయేసు - 
    జీవము నీవె జయ యేసు ||జయ||

7. దయ్యాల గెల్చిన జయ యేసు - 
    దయ్యాలు ఓడెను జయ యేసు 
    కయ్యము కలిగిన జయ యేసు - 
    అయ్యో నీవే జయ యేసు ||జయ||
DOWNLOAD MP3 SONG HERE

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...