Showing posts with label Mammu prema juchi devuda. Show all posts
Showing posts with label Mammu prema juchi devuda. Show all posts

01 June 2026

మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు Mammu prema juchi devuda

256
దైవ వాక్యము
(చాయ: ధరణిలోని ధనము లెల్ల)
రా - యాదుకుల కాంభోజీ, తా - ఆది

మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు - మకు బోధపరపఁగ = ఇమ్ముగాను లేఖనముల - నిచ్చె మాకు భూమిపై ||మమ్ము||

1.మా మొగంబు నద్దమందు - మేము చూచునట్లుగ - మేము గాన వచ్చు మాస్థితి - మిగులఁ దేటగ నందులో ||మమ్ము||

2.పాప మనెడు బురద గోతిని - బడిన మమ్ము నెత్తఁగా = పాప రహితుండైన యేసు - ప్రాణ మిచ్చెను బ్రేమచే ||మమ్ము||

3.పాప మంతయు వీడి మేము - భక్తి సరణిని నడువఁగఁ = ప్రాపుగాఁ దన యాత్మ నిచ్చెఁ - ప్రాణసఖుఁడగు యేసుండు ||మమ్ము||

4.సకల జనులు లేఖనముల - సత్యములను దెలియుచు = అకలుషముగ వానినమ్మఁగ - నంపు మాత్మను రక్షకా ||మమ్ము||
- జేకబ్  చాంబర్లిన్ 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...