Showing posts with label Raj Prakash Paul songs. Show all posts
Showing posts with label Raj Prakash Paul songs. Show all posts

06 May 2023

Yesu rakhaka shathakoti | యేసు రక్షకా శతకోటి స్తోత్రం


యేసు రక్షకా శతకోటి స్తోత్రం
జీవన దాత కోటి కోటి స్తోత్రం
యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2)
నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2)
యేసు ఆరాధించెదను - ఆరాధించెదను

శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు
నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2)
నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2) 
చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2) ||యేసు రక్షకా ||

పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు
ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2) 
తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2)
నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు (2) ||యేసు
రక్షకా ||

యేసు ఆరాధించెదను - ఆరాధించెదను
నా సమస్తము అర్పించి - ఆరాధించెదను
నా సర్వము అర్పించి - ఆరాధించెదను
శరణం శరణం యేసు స్వామి శరణం (3) ||యేసు ఆరాధించెదను | |

24 May 2021

Ninne Ne Nammithi Neeve | నిన్నే నే నమ్మితీ నీవే నా వైధ్యుడవు

నిన్నే నే నమ్మితీ నీవే నా వైధ్యుడవు
నిన్నే నే నమ్మితీ నీవే నా ఆధారము 
ఏదేమైనా, ఏ స్థితియైన, నీవే నా సహాయము 

ఎంతగానో వేదనతో  బలమంతా కోల్పోతిని. 
నిరీక్షణ నీవే దేవా నన్ను బాగుచేయుమయ్యా
ఏ తోడు లేక, చేయూత లేక. 
నన్నందరు విడచిపోతిరే
నా ఆధారం , ఆశ్రయం , ఆనందం , అభయం 
నీవేగా. కృప చూపుము.

ఈ కన్నీరంతా ప్రేమతోనే తుడచివేయుమయ్యా 
దైవాత్మతో నన్ను తాకి నన్ను స్వస్థపరచుమయ్యా 
యెహోవా రాఫా, యెహోవా షమ్మా  
సర్వశక్తిమంతుడైన దేవా 
నీకసాధ్యమైనది ఏదియు లేదని నమ్మెద
 జీవింపుము.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...